- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IndusInd Bank CEO : ఇండస్ ఇండ్ బ్యాంక్ సీఈవో రాజీనామా.. కారణం అదేనా?
ఇండస్‌ఇండ్ బ్యాంక్ యొక్క సీఈఓ(IndusInd Bank CEO) సుమంత్ కత్‌పాలియా(Sumant Kathpalia) నేడు తన పదవికి రాజీనామా చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : ఇండస్‌ఇండ్ బ్యాంక్ యొక్క సీఈఓ(IndusInd Bank CEO) సుమంత్ కత్‌పాలియా(Sumant Kathpalia) నేడు తన పదవికి రాజీనామా చేశారు. బ్యాంక్‌లో ఇటీవల జరిగిన కొన్ని తప్పిదాల కారణంగా వాటికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన మంగళవారం తన పదవికి రాజీనామా(Resignation) చేశారు. బ్యాంక్ యొక్క డెరివేటివ్స్ విభాగంలో అకౌంటింగ్ లోపాల వల్ల బ్యాంక్‌కు దాదాపు 1,959 కోట్ల రూపాయల నష్టం వచ్చిందని ఆడిటింగ్ లో నిర్ధారణ అయింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) నిబంధనలను కూడా ఉల్లంఘించినట్టు సమాచారం. కాగా ఈ లోపాలపై RBI సీరియస్ అయింది. తక్షణమే సుమంత్ కత్‌పాలియాతో పాటు డిప్యూటీ సీఈఓ అరుణ్ ఖురానాను కూడా వారి పదవుల నుండి తొలగించాలని అధికారులను ఆదేశించింది.
ఈ నేపథ్యంలో, సుమంత్ కత్‌పాలియా, అరుణ్ ఖురానా నేడు వారి పదవులకు రాజీనామా చేశారు. త్వరలోనే బ్యాంకుకు కొత్త సీఈఓను నియమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. కాగా సుమంత్ కత్‌పాలియా 2008 నుండి బ్యాంక్‌లో పనిచేస్తుండగా.. 2020 నుండి సీఈఓగా ఉన్నారు. ఇండస్‌ఇండ్ బ్యాంక్ భారతదేశంలో ఐదవ అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ కాగా ఈ వార్తల నేపథ్యంలో బ్యాంక్ షేర్ల ధర 30% కంటే ఎక్కువ పడిపోయిందని, బ్యాంక్ యొక్క రేటింగ్ కూడా తగ్గే అవకాశం ఉందని మూడీస్ అనే సంస్థ తెలిపింది.






