Indigo: ఇండిగో బంపర్ ఆఫర్.. రూ. 1,219కే ఫ్లైట్ టికెట్

by S Gopi |

దేశీ మార్గాల్లో అన్నీ కలిసి వన్-వే ఛార్జీ రూ. 1,219కే విమాన ప్రయాణం చేయవచ్చని..

Indigo: ఇండిగో బంపర్ ఆఫర్.. రూ. 1,219కే ఫ్లైట్ టికెట్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో భారీ ఆఫర్ ప్రకటించింది. సంస్థ 19వ వార్షికోత్సవం సందర్భంగా 'హ్యాపీ ఇండిగో డే సేల్ ' ద్వారా అతి తక్కువ ధరకే డొమెస్టిక్ ఫ్లైట్ జర్నీ ఆఫర్ చేస్తోంది. పరిమిత కాలానికి ప్రకటించిన ఈ ఆఫర్ కింద దేశీ మార్గాల్లో అన్నీ కలిసి వన్-వే ఛార్జీ రూ. 1,219కే విమాన ప్రయాణం చేయవచ్చని, అంతర్జాతీయ రూట్లలో రూ. 4,319, ఇండిగో స్ట్రెచ్, బిజినెస్ సీట్ బుకింగ్‌లు రూ. 9,919కే వెళ్లవచ్చని వెల్లడించింది. ఈ ఆఫర్ ఆగష్టు 3 నుంచి ఆగష్టు 6 రాత్రి వరకు మాత్రమే ఉంటుందని, ఆగష్టు 10 నుంచి 2026, మార్చి 31 మధ్య ప్రయాణాలకు మాత్రమే చెల్లుబాటు అవుతునని ఇండిగో తెలిపింది. విమానం బయలుదేరే తేదీకి కనీసం 7 రోఝుల ముందు చేసిన బుకింగ్‌లకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. టికెట్ ధరల డిస్కౌంట్లతో పాటు ఇండిగో అనేక రకాల యాడ్-ఆన్ సేవలపై ఆఫర్లు ఇస్తోంది. ఎంపిక చేసిన దేశీయ, అంతర్జాతీయ రూట్లలో కొన్ని సీట్లను ఎంచుకునేందుకు రూ. 19 నుంచి ప్రారంభమవుతుంది. అత్యవసరంగా అదనపు లెగ్‌రూమ్ సీట్లు దేశీయ రూట్లలో రూ. 500 నుంచి లభిస్తుంది.

Next Story