- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రయాణికులకు ఇండిగో రూ.610 కోట్లు రిఫండ్
ఇటీవల తలెత్తిన ఇండిగో సంక్షోభం గురించి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : ఇటీవల తలెత్తిన ఇండిగో సంక్షోభం గురించి తెలిసిందే. వందల కొద్దీ ఇండిగో విమానాలు క్యాన్సిల్ అవడమే కాకుండా వందల ఫ్లయిట్స్ గంటల తరబడి ఆలస్యంగా నడిచాయి. దీనిపై ఇండిగో క్షమాపణలు చెప్పినప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా స్పందించి, ప్రయాణికులకు తక్షణమే రీఫండ్ చెల్లించాలని ఆదేశాలు జారీచేసింది. కాగా ఇప్పటివరకు రద్దయిన, ఆలస్యమైన ఇండిగో విమానాల టికెట్లకు సంబంధించి రూ.610 కోట్ల మేర రీఫండ్ చేసినట్టు కేంద్ర పౌరవిమానయాన శాఖ ప్రకటించింది.
అలాగే ఫ్లయిట్స్ రీషెడ్యూల్ చేసేందుకు ఎలాంటి అదనపు ఫీజు వసూలు చేయరాదని సంస్థకు తెలిపింది. ప్రయాణికులకు చెందిన 3,000 లగేజీలను డెలివరీ చేసిందని వెల్లడించింది. సర్వీసులను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని, లగేజి పూర్తి స్థాయిలో డెలివరీ చేసేందుకు సంస్థ సీఈవో, గ్రూప్ సభ్యులతో కూడిన ఓ గ్రూప్ ను ఏర్పాటు చేయాలని కేంద్రం ఇండిగోను ఆదేశించింది.






