IndiGo: 78 శాతం క్షీణించిన ఇండిగో లాభాలు

by S Gopi |

ఇది గతేడాది వచ్చిన రూ. 2,448.8 కోట్ల లాభాలతో పోలిస్తే ఏకంగా 78 శాతం క్షీణత కావడం గమనార్హం.

IndiGo: 78 శాతం క్షీణించిన ఇండిగో లాభాలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: గత నెలలో పెద్ద ఎత్తున విమానాలను రద్దు చేసిన నేపథ్యంలో ఎయిర్‌లైన్ కంపెనీ ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ డిసెంబర్ త్రైమాసికంలో భారీగా లాభాలను కోల్పోయింది. గురువారం కంపెనీ ప్రకటించిన త్రైమాసిక ఫలితాల్లో రూ. 549.1 కోట్ల లాభాలను పేర్కొంది. ఇది గతేడాది వచ్చిన రూ. 2,448.8 కోట్ల లాభాలతో పోలిస్తే ఏకంగా 78 శాతం క్షీణత కావడం గమనార్హం. కేంద్రం ప్రభుత్వం తెచ్చిన కొత్త లేబర్ కోడ్స్, డిసెంబర్‌లో కంపెనీ ఎదుర్కొన్న విమాన సేవల్లో అంతరాయం వల్ల కంపెనీ లాభాలకు గండిపడింది. కంపెనీ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం, కొత్త లేబర్ కోడ్స్ అమలు చేసేందుకు రూ. 969 కోట్లు, గత నెలలో ఏర్పడిన కార్యకలాపాల అంతరాయం వల్ల మరో రూ. 577 కోట్లు ఖర్చు చేశామని ఇండిగో తెలిపింది. తద్వారా ఈ త్రైమాసికంలో కంపెనీకి రూ. 1,546 కోట్ల భారం పడింది. ఇక, ఈ త్రైమాసికంలో ఇండిగోకు రూ. 24,540.6 కోట్ల ఆదాయాన్ని వెల్లడించింది. ఇది గతేడాది వచ్చిన రూ. 22,992.8 కోట్లతో పోలిస్తే పెరిగింది.

Next Story