- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IndiGo: ఇండిగో కొత్త సీఈఓగా విలియమ్ వాల్ష్
వాల్ష్ ప్రస్తుతం అంతర్జాతీయ విమాన రవాణా సంఘం (ఐఏటీఏ) డైరెక్టర్ జనరల్‌గా ఉన్నారు.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో కొత్త సీఈఓను నియమించింది. ఇటీవల అనూహ్యంగా పీటర్స్ ఎల్బర్స్ రాజీనామా నేపథ్యంలో మాజీ బ్రిటిష్ ఎయిర్‌వేస్ చీఫ్ విలియం వాల్ష్‌ను తమ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా (సీఈఓ) నియమించినట్లు ఇండిగో మంగళవారం తెలిపింది. వాల్ష్ ప్రస్తుతం అంతర్జాతీయ విమాన రవాణా సంఘం (ఐఏటీఏ) డైరెక్టర్ జనరల్‌గా ఉన్నారు. ఈ సంస్థలో ఆయన పదవీకాలం జూలై 31తో ముగుస్తుంది, ఆగస్టు 3 నాటికి ఆయన ఇండిగోలో చేరతారని భావిస్తున్నారు. గతంలో పలు ప్రముఖ ఎయిర్‌లైన్ కంపెనీల్లో వాల్ష్ కీలక బాధ్యతలు చేపట్టారు. గతేడాది డిసెంబర్‌లో వేలాదిగా ఇండిగో విమానాలు క్యాన్సిల్ అయిన సంగతి తెలిసిందే. దీనివల్ల ప్రయాణీకులు పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో సీఈఓగా ఉన్న పీటర్ ఎల్బర్స్ తన పదవీకాలం ముగిసేందుకు 18 నెలలు ఉండగానే రాజీనామా చేశారు. కొత్త సీఈఓగా వాల్ష్‌కు ఉన్న అనుభవంతో వృద్ధి దశలో ఉన్న ఇండిగోలోకి ఆహ్వానిస్తున్నామని కంపెనీ వెల్లడించింది.






