Inflation: 8 నెలల గరిష్ఠానికి టోకు ద్రవ్యోల్బణం

by S Gopi |

ఫిబ్రవరి నెలలో టోకు ద్రవ్యోల్బణం 2.38 శాతానికి పెరిగింది.

Inflation: 8 నెలల గరిష్ఠానికి టోకు ద్రవ్యోల్బణం
X

దిశ, బిజినెస్ బ్యూరో: టోకు ధరల ఆధారిత సూచీ(డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం 8 నెలల గరిష్ఠ స్థాయికి చేరింది. సోమవారం ప్రభుత్వ గణాంకాలు వెల్లడించిన వివరాల ప్రకారం, ఫిబ్రవరి నెలలో టోకు ద్రవ్యోల్బణం 2.38 శాతానికి పెరిగింది. అంతకుముందు జనవరిలో ఇది 2.31 శాతంగా నమోదైంది. కూరగాయలు వంటి ఆహార వస్తువులు, ఆహారేతర, తయారీ వస్తువుల ధరలు పెరగడంతో టోకు ద్రవ్యోల్బణం పెరిగింది. సమీక్షించిన నెలలో ఆహార పదార్థాల ధరలు హోల్‌సేల్ మార్కెట్లో 5.94 శాతానికి దిగొచ్చింది. అంతకుముందు ఇది జనవరిలో 7.47 శాతంగా ఉంది. కూరగాయల ద్రవ్యోల్బణం జనవరిలో 8.35 శాతం నుంచి గత నెల 5.80 శాతానికి తగ్గింది. అయితే, ఉల్లి ధరలు 48.05 శాతానికి, బంగాళదుంప ధరలు 27.54 శాతంగా నమోదయ్యాయి. తృణధాన్యాల ధరలు ఫిబ్రవరిలో 6.77 శాతం పెరిగాయి.ఇంధన, విద్యుత్ టోకు ద్రవ్యోల్బణం 2.78 శాతం ఉంచి 0.71 శాతానికి గణనీయంగా తగ్గాయి. గత కొన్ని నెలలుగా దేశంలో ద్రవ్యోల్బణ ఒత్తిడి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. మెరుగైన వాతావరణం కారణంగా కూరగాయల సరఫరా సానుకూలంగా ఉండటం, రానున్న నెలల్లో వడ్డీ రేట్ల తగ్గింపునకు దోహదపడనున్నాయి.

Next Story