- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Wholesale Inflation: మళ్లీ దిగొచ్చిన టోకు ద్రవ్యోల్బణం.. ఆగస్టులో 0.13 శాతం
అంతకుముందు ఆగష్టులో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం 0.52 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే.

దిశ, బిజినెస్ బ్యూరో: టోకు ద్రవ్యోల్బణం గత నెలలో మరింత దిగొచ్చింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ మంగళవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, సెప్టెంబర్ నెలకు సంబంధించి టోకు ధరల సూచీ ఆధారిత (డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం 0.13 శాతానికి తగ్గించింది. అంతకుముందు ఆగష్టులో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం 0.52 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. సమీక్షించిన నెలలో టోకు ద్రవ్యోల్బణం సానుకూలంగా నమోదవడానికి ప్రధానంగా ఆహార పదార్థాలు, ఉత్పత్తులు, తయారీ, ఆహారేతర వస్తువులు, రవాణా పరికరాల ధరలు పెరగడమే కారణం. ఆహార పదార్థాల ధరలు 1.38 శాతం, ఆహారేటర వస్తువుల ధరలు 1.06 శాతం క్షీణించాయి. ముడి పెట్రోలియం, సహజ వాయువు 0.64 శాతం పెరిగాయి. కూరగాయల ధరలు ఆగస్టులో 14.18 శాతం ఉండగా, అక్కడి నుంచి సెప్టెంబర్‌లో 24.41 శాతం తగ్గాయి. ఇంధన, విద్యుత్ ద్రవ్యోల్బణం 0.14 శాతంతో స్వల్పంగా తగ్గాయని గణాంకాలు వెల్లడించాయి. ఆహార, ఆహారేతర ఉత్పత్తులు, రవాణా పరికరాలు, దుస్తుల తయారీ ధరల పెరుగుదల కారణంగా గత నెలలో టోకు ద్రవ్యోల్బణంలో సానుకూల ఉందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.






