- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
UPI: ఇజ్రాయెల్‌లోనూ యూపీఐ సేవలు.. ప్రధాని మోడీ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యూపీఐ పేమెంట్స్ విషయంలో ఒప్పందం కుదిరిందని చెప్పారు.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(యూపీఐ) సేవలు ఇజ్రాయెల్‌కూ విస్తరించాయి. ఇది డిజిటల్ ఫైనాన్స్ సహకారంలో ప్రధాన మైలురాయిగా నిలువనుంది. ఆ దేశ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యూపీఐ పేమెంట్స్ విషయంలో ఒప్పందం కుదిరిందని చెప్పారు. ఈ సందర్భంగా ఉమ్మడి విలేకరుల సమావేశంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ఈ పరిణామంపై సంతోషం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్‌లో యూపీఐ వినియోగం కోసం ఒప్పందం కుదరడం ఆనందంగా ఉంది. పరస్పర విశ్వాసం, ప్రజాస్వామ్య విలువలపై ఏర్పడిన ఇరు దేశాల బంధం మరింత బలపడుతోందని చెప్పారు. తాము కీలకమైన, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్టు పేర్కొన్నారు. భారత్, ఇజ్రాయెల్ మధ్య డిజిటల్, ఆర్థిక భాగస్వామ్యం బలోపేతం చేస్తూ, ఇజ్రాయెల్ దేశ చెల్లింపుల వ్యవస్థతో యూపీఐని అనుసంధానం చేయనున్నారు. దీని ద్వారా రెండు దేశాల మధ్య చెల్లింపులు వేగవంతంగా, సులభంగా, తక్కువ ఖర్చుతో పూర్తవుతాయి. రెండు దేశాల వ్యాపారాలు, ప్రజల డిజిటల్ చెల్లింపులు మరింత సులభతరంగా మారుతాయి.






