- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Two Wheelers: విదేశాల్లో మన బైకులకు భారీ గిరాకీ
ఆయా దేశాల్లో ఆర్థిక పునరుద్ధరణ వేగంగా జరుగుతుండటంతో మనదేశంలో తయారైన బైకులు, స్కూటర్లను ఎక్కువమంది కొంటున్నారు.

దిశ, బిజినెస్ బ్యూరో: భారత ద్విచక్ర వాహనాలకు ఇతర దేశాల్లో భారీగా గిరాకీ పెరుగుతోంది. ముఖ్యంగా ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆగ్నేయాసియా వంటి కీలక విదేశీ మార్కెట్లలో పెరుగుతున్న డిమాండ్ కారణంగా భారత్ నుంచి ద్విచక్ర వాహనాల ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. ఆయా దేశాల్లో ఆర్థిక పునరుద్ధరణ వేగంగా జరుగుతుండటంతో మనదేశంలో తయారైన బైకులు, స్కూటర్లను ఎక్కువమంది కొంటున్నారు. తాజా జూన్ నెల గణాంకాల ప్రకారం, దేశీయ అతిపెద్ద టూవీలర్ కంపెనీ బజాజ్ ఆటో ద్విచక్ర వాహనాల ఎగుమతుల్లో 18 శాతం పెరుగుదలను చూసింది. ఈ ఏడాది కంపెనీ మొత్తం 1,49,167 యూనిట్లను ఎగుమతి చేసింది. మరో దిగ్గజ కంపెనీ టీవీఎస్ మోటార్స్ సైతం ద్విచక్ర వాహనాల ఎగుమతుల్లో 58 శాతం అధికంగా 66,434 బైకులు, స్కూటర్లను ఎగుమతి చేసింది. గతేడాది ఇదే నెలలో కంపెనీ 1,04,686 యూనిట్లను విదేశాలకు పంపింది. హీరో మోటోకార్ప్ జూన్ నెలలో ఏకంగా 140 శాతం అధికంగా 28,827 యూనిట్లను, రాయల్ ఎన్‌ఫీల్డ్ 79 శాతం ఎక్కువగా 12,583 బైకులను, హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ 10 శాతం అధికంగా 40,335 యూనిట్లను ఎగుమతి చేశాయి. ఎగుమతులు ఊహించిన దానికంటే ఎక్కువగా పెరగడంతో కంపెనీల మొత్తం అమ్మకాల్లో కూడా సానుకూలత కనిపించిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. దేశీయంగా ద్రవ్యోల్బణం తగ్గడం, సానుకూల రుతుపవనాలు, వడ్డీ రేట్లు దిగిరావడం, వ్యవసాయ రంగం మెరుగ్గా ఉండటం కలిసొచ్చిందని నిపుణులు పేర్కొన్నారు.






