Trade Deficit: భారీగా తగ్గిన వాణిజ్య లోటు

by S Gopi |

వస్తు ఎగుమతులు అంతకుముందు నెలలో 36.61 బిలియన్ డాలర్ల నుంచి మార్చిలో 38.92 బిలియన్ డాలర్లకు పెరిగాయి.

Trade Deficit: భారీగా తగ్గిన వాణిజ్య లోటు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ వాణిజ్య లోటు గత నెలలో గణనీయంగా దిగొచ్చింది. ఇరాన్ యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాల ఎగుమతులకు ఆటంకం ఉండవచ్చని, ఇంధనంతో పాటు ఇతర దిగుమతుల ధరలు పెరగవచ్చనే ఆందోళలు ఉన్నప్పటికీ మార్చి నెలలో భారత వాణిజ్య లోటు 20.67 బిలియన్ డాలర్ల(రూ. 1.93 లక్షల కోట్ల)కు తగ్గిందని ప్రభుత్వ గణాంకాలు బుధవారం వెల్లడించాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, వస్తు ఎగుమతులు అంతకుముందు నెలలో 36.61 బిలియన్ డాలర్ల నుంచి మార్చిలో 38.92 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ఇదే సమయంలో, దిగుమతులు మాత్రం 63.71 బిలియన్ డాలర్ల నుంచి 59.59 బిలియన్ డాలర్లకు తగ్గాయి. ఎగుమతులు పెరగడం, దిగుమతులు క్షీణత పరిణామాలతో వాణిజ్య లోటు క్షీణించిందని నిపుణులు తెలిపారు. ఇరాన్–గల్ఫ్ ప్రాంతాల్లో యుద్ధ పరిస్థితుల కారణంగా ఆయిల్ సరఫరా, వాణిజ్య మార్గాలపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. ముఖ్యమైన హోర్ముజ్ జలసంధి సమస్యలు ఇంధన రవాణాకు ఆటంకం కలిగించవచ్చని భావిస్తున్నారు. మనదేశం గల్ఫ్ దేశాల షిప్పింగ్ మార్గాలపై ఎక్కువగా ఆధారపడుతుంది. ఈ పరిస్థితుల్లో రవాణా, బీమా ఖర్చులు పెరగడం వల్ల వాణిజ్య ఖర్చులు మరింత ప్రమాదకరంగా మారవచ్చు. ఈ పరిస్థితులు భవిష్యత్తు దిగుమతులు, ఎగుమతులపై ప్రభావం చూపవచ్చు.

Next Story