- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Trade Deficit: జూన్‌లో తగ్గిన వాణిజ్య లోటు
వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, జూన్ నెలలో భారత ఎగుమతుల 35.14 బిలియన్ డాలర్ల(రూ. 3.01 లక్షల కోట్లు)గా ఉన్నాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది జూన్ నెలకు సంబంధించి భారత వాణిజ్య లోటు దిగొచ్చింది. అంతకుముందు మే నెలలో దేశ వాణిజ్య లోటు 21.88 బిలియన్ డాలర్లు(రూ. 1.88 లక్షల కోట్లు) ఉండగా, గత నెలలో ఇది 18.78 బిలియన్ డాలర్ల(రూ. 1.61 లక్షల కోట్లకు) తగ్గిందని మంగళవారం ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, జూన్ నెలలో భారత ఎగుమతుల 35.14 బిలియన్ డాలర్ల(రూ. 3.01 లక్షల కోట్లు)గా ఉన్నాయి. గత సంవత్సరం ఇదే నెలలోనూ స్వల్ప తేడాతో 35.16 బిలియన్ డాలర్లు(రూ. 3.01 లక్షల కోట్లు)గా నమోదయ్యాయి. ఇదే సమయంలో దిగుమతులు 3.71 శాతం తగ్గి 53.92 బిలియన్ డాలర్ల(రూ. 4.63 లక్షల కోట్ల)కు చేరుకున్నాయి, గతేడాది 56 బిలియన్ డాలర్లు(రూ. 4.80 లక్షల కోట్లు)గా నమోదయ్యాయి. ఇక, సమీక్షించిన నెలలో సేవల ఎగుమతులు రూ. 2.82 లక్షల కోట్లుగానూ, దిగుమతులు రూ. 1.5 లక్షల కోట్లు)గానూ జరిగాయి. అమెరికా, ఇతర దేశాలతో కొనసాగుతున్న వాణిజ్య చర్చలు, యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల బెదిరింపులు ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-మే నెలల్లో దేశ ఎగుమతులు రూ. 1.21 లక్షల కోట్ల నుంచి రూ. 1.48 లక్షల కోట్లకు పెరగడం గమనార్హం.






