- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TRAI: 78 లక్షలు పెరిగిన టెలికాం సబ్‌స్క్రైబర్లు
జనవరిలో దేశ టెలికాం సబ్‌స్క్రైబర్ల సంఖ్య 78.6 లక్షలు పెరిగి 131.4 కోట్లకు చేరింది.

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది జనవరిలో మొత్తం టెలికాం సబ్‌స్క్రైబర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. గురువారం టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ విడుదల చేసిన డేటా ప్రకారం, బ్రాడ్‌బ్యాండ్ వృద్ధి మందగించినప్పటికీ, వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్లు పెరగడంతో జనవరిలో దేశ టెలికాం సబ్‌స్క్రైబర్ల సంఖ్య 78.6 లక్షలు పెరిగి 131.4 కోట్లకు చేరింది. ఇందులో అధిక భాగం వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్ల వాటానే. వీరి సంఖ్య 75.7 లక్షలు పెరిగి 126.6 కోట్లకు చేరిందని డేటా వెల్లడించింది. ఇందులో భారతీ ఎయిర్‌టెల్ 44 లక్షల మంది కొత్త కస్టమర్లను సాధించగా, ఆ తర్వాత స్థానంలో 24.4 లక్షలతో రిలయన్స్ జియో నిలిచింది. ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ 2.71 లక్షల మంది వినియోగదారులను చేర్చుకుంది. ఇక, ఆర్థిక సమస్యల్లో ఉన్న వొడాఫోన్ ఐడియా 4.11 లక్షల మంది సబ్‌స్క్రైబర్లను కోల్పోయింది. గ్రామీణ ప్రాంతాల్లో 29.7 లక్షల కొత్త కస్టమర్లు చేరగా, పట్టణ ప్రాంతాల్లో 48.9 లక్షల మంది చేరారని ట్రాయ్ పేర్కొంది.






