- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
India: సంస్కరణలతో భవిష్యత్తు ప్రపంచ అనిశ్చితిని భారత్ తట్టుకోగలదు: సీఈఏ నాగేశ్వరన్
ఇప్పటికే గ్లోబల్ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాం.

దిశ, బిజినెస్ బ్యూరో: భౌగోళిక రాజకీయ పరిణామాలు కొనసాగే అవకాశం ఉన్నందున భారత్ చేపడుతున్న సంస్కరణలు భవిష్యత్తులో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు దన్నుగా ఉంటాయని ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్ అన్నారు. ఇప్పటికే గ్లోబల్ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాం. వృద్ధి అనుకున్న దానికంటే మెరుగ్గా వచ్చినా ఆశ్చర్యపోవక్కరలేదన్నారు. బుధవారం ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్(ఏఐఎంఏ) కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) సంస్కరణలు అమెరికా విధించిన అధిక టారిఫ్ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు సహాయపడతాయి. ముఖ్యంగా దేశ జీడీపీ వృద్ధికి 0.2 శాతం నుంచి 0.3 శాతం సహకారం లభిస్తుంది. జీఎస్టీ ప్రయోజనాలు వస్తువుల ధరలను తగ్గించడం ద్వారా ప్రజల కొనుగోలు శక్తిని పెంచేందుకే కాదు, దీన్ని ప్రైవేట్ రంగానికి బదిలీ కావాలని నాగేశ్వరన్ అన్నారు. ప్రభుత్వం తన వంతు పాత్ర పోషించినప్పటికీ, ప్రైవేట్ రంగం ఉత్పాదకత, విస్తరణపై ఆధారపడి ఫలితాలు ఉంటాయి. తద్వారా వృద్ధికి ఎక్కువ అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు.






