Net Direct Tax: ప్రత్యక్ష పన్నుల నికర వసూళ్లు రూ. 11.89 లక్షల కోట్లు

by S Gopi |

స్థూలంగా చూస్తే ప్రత్యక్ష పన్ను వసూళ్లు(రిఫండ్‌లకు ముందు) రూ. 13.92 లక్షల కోట్లుగా ఉన్నాయి.

Net Direct Tax: ప్రత్యక్ష పన్నుల నికర వసూళ్లు రూ. 11.89 లక్షల కోట్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ 12 వరకు ప్రత్యక్ష పన్నుల నికర వసూళ్లు 6.33 శాతం వృద్ధితో రూ.11.89 లక్షల కోట్లకు చేరాయి. ఈ మేరకు ఆదాయపు పన్ను శాఖ గణాంకాలు విడుదల చేసింది. కార్పొరేట్ పన్ను వసూళ్లు పెరగడం, రిఫండ్‌లు నెమ్మదించడం ఇందుకు నేపథ్యం. స్థూలంగా చూస్తే ప్రత్యక్ష పన్ను వసూళ్లు(రిఫండ్‌లకు ముందు) రూ. 13.92 లక్షల కోట్లుగా ఉన్నాయి. గత సంవత్సరం ఇదే కాలంలో రూ. 13.60 లక్షల కోట్లుగా ఉన్నాయి. జారీ చేయబడిన వాపసులు రూ. 2.03 లక్షల కోట్లకు తగ్గాయి, ఇది 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ. 2.41 లక్షల కోట్లతో పోలిస్తే దాదాపు 16 శాతం క్షీణత. మొత్తం వసూళ్లలో కార్పొరేట్ పన్ను వసూళ్లు రూ. 4.91 లక్షల కోట్ల నుంచి రూ. 5.02 లక్షల కోట్లకు పెరిగాయి, అయితే కార్పొరేటేతర పన్ను వసూళ్లు (వ్యక్తులు, హెచ్‌యూఎఫ్‌లు సహా) రూ. 5.94 లక్షల కోట్ల నుంచి రూ. 6.56 లక్షల కోట్లకు పెరిగాయి. సెక్యూరిటీ లావాదేవీల పన్ను (ఎస్‌టీటీ) వసూల్లు స్వల్పంగా రూ. 30,878 కోట్లకు పెరిగాయి. ఇతర పన్నులు మొత్తం రూ. 294 కోట్లుగా ఉన్నాయి. 2025-26 పూర్తి ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం రూ. 25.20 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్లు జరుగుతాయని ఇది గత ఆర్థిక సంవత్సరం కంటే 12.7 శాతం అధికం.

Next Story