- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IIP: మార్చి నెలలో 3 శాతం పెరిగిన పారిశ్రామికోత్పత్తి
సమీక్షించిన నెలలో కీలక తయారీ రంగ ఉత్పత్తి 3 శాతానికి చేరింది. ఫిబ్రవరిలో ఇది 2.9 శాతం పెరిగింది

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ పారిశ్రామికోత్పత్తి వృద్ధి ఈ ఏడాది మార్చిలో బలంగా పుంజుకుని 3 శాతం వృద్ధిని నమోదు చేసినట్టు ప్రభుత్వం గణాంకాలు వెల్లడించాయి. అంతకుముందు ఫిబ్రవరి నెలలో నమోదైన ఆరు నెలల కనిష్టం 2.9 శాతం కంటే పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) స్వల్పంగా పెరిగింది. అయితే, గతేడాది మార్చిలో ఉన్న 5.5 శాతం కంటే ఈసారి తక్కువ వృద్ధి కనిపించింది. సమీక్షించిన నెలలో కీలక తయారీ రంగ ఉత్పత్తి 3 శాతానికి చేరింది. ఫిబ్రవరిలో ఇది 2.9 శాతం పెరిగింది. విద్యుదుత్పత్తి అత్యధికంగా 6.3 శాతం(ఫిబ్రవరిలో 3.6 శాతం) పుంజుకోగా, మైనింగ్ ఉత్పత్తి 0.4 శాతం(అంతకుముందు నెలలో 1.6 శాతం) మాత్రమే వృద్ధి సాధించింది. తయారీ రంగంలో ఎక్కువగా ఎలక్ట్రికల్ పరికరాల తయారీ 15.7 శాతం పెరిగింది. మోటార్ వాహనాలు, ట్రైలర్లు, సెమీ ట్రైలర్లు 10.3 శాతం, బేసిక్ మెటల్స్ 6.9 శాతం వృద్ధి నమోదు చేశాయి. మౌలిక సదుపాయాలు, నిర్మాణ వస్తువుల తయారీ 8.8 శాతం, కన్స్యూమర్ డ్యూరబుల్స్ 6.6 శాతం, పెరిగాయి. 2024-25 పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఐఐపీ 4 శాతంగా ఉంది. ఇది అంతకుముందు 2023-24లో నమోదైన 5.9 శాతం కంటే నెమ్మదించింది.






