- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
GST Collection: జూన్ నెల జీఎస్టీ ఆదాయం రూ. 1.85 లక్షల కోట్లు
ఏప్రిల్‌లో రికార్డు స్థాయి రూ. 2.37 లక్షల కోట్లు వచ్చిన తర్వాత మేలో రూ. 2.01 లక్షల కోట్ల జీఎస్టీ ఆదాయం వచ్చింది.

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది జూన్ నెలకు సంబంధించి వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు రూ. 1.85 లక్షల కోట్లుగా నమోదైనట్టు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. ఇది గతేడాది జూన్‌లో వచ్చిన రూ. 1.74 లక్షల కంటే 6.2 శాతం పెరిగాయి. అయితే, అంతకుముందు మే నెలతో పోలిస్తే గత నెలలో వసూళ్లు తగ్గాయి. ఏప్రిల్‌లో రికార్డు స్థాయి రూ. 2.37 లక్షల కోట్లు వచ్చిన తర్వాత మేలో రూ. 2.01 లక్షల కోట్ల జీఎస్టీ ఆదాయం వచ్చింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, మొత్తం వసూళ్లలో సెంట్రల్ జీఎస్టీ రూ. 34,558 కోట్లు, స్టేట్ జీఎస్టీ రూ. 43,268 కోట్లు, ఐజీఎస్టీ రూ. 93,280 కోట్లు. సెస్ రూ. 13,491 కోట్లుగా ఉన్నాయి. సమీక్షించిన నెలలో రీఫండ్లు 28.4 శాతం పెరిగి రూ. 25,491 కోట్లకు చేరుకున్నాయి. కాగా, జూలై నెలతో దేశంలో జీఎస్టీ విధానాన్ని అమలు చేసి ఎనిమిదేళ్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలోనే గత ఐదు సంవత్సరాలలో వసూళ్లు రెట్టింపు అయ్యాయని ప్రభుత్వం తెలిపింది. 2024-25లో రికార్డు స్థాయి రూ. 22.08 లక్షల కోట్లకు జీఎస్టీ వసూళ్లు చేరుకున్నాయని, ఇది 2020-21లో వచ్చిన రూ. 11.37 లక్షల కోట్ల కంటే చాలా ఎక్కువని పేర్కొంది.






