India: భారత వృద్ధి అంచనా 6.4-6.7 శాతం: డెలాయిట్ ఇండియా

by S Gopi |

ప్రపంచ వాణిజ్యంలో భారత్‌కు పెరుగుతున్న స్థానం వంటి అంశాలు ఇందుకు మద్దతుగా నిలవవచ్చని డెలాయిట్ ఇండియా వెల్లడించింది.

India: భారత వృద్ధి అంచనా 6.4-6.7 శాతం: డెలాయిట్ ఇండియా
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత ఆర్థిక వ్యవస్థ 2025-26లో 6.4-6.7 శాతం మధ్య వృద్ధిని నమోదు చేయొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. దేశీయ డిమాండ్, పాలసీ నిర్ణయాలు, ప్రపంచ వాణిజ్యంలో భారత్‌కు పెరుగుతున్న స్థానం వంటి అంశాలు ఇందుకు మద్దతుగా నిలవవచ్చని డెలాయిట్ ఇండియా తన తాజా నివేదికలో వెల్లడించింది. ప్రపంచ ఆర్థికవ్యవస్థ అల్లకల్లోలంగా ఉన్న సమయంలో భారత్ ఆర్థికవ్యవస్థ స్థిరంగా, ప్రత్యేకంగా నిలుస్తుంది. స్టాక్ మార్కెట్ల ర్యాలీ, తగ్గుముఖం పడుతున్న ద్రవ్యోల్బణం, ప్రభుత్వం తీసుకున్న ఆర్థిక సంస్కరణలు, అధిక జనాభా, శ్రామిక శక్తి ద్వారా దేశ జీడీపీ మెరుగ్గా కొనసాగగలదని డెలాయిట్ ఇండియా ఆర్థికవేత్త రుంకి మజుందార్ అన్నారు. వీటికితోడు వినియోగం, మౌలిక సదుపాయాల విస్తరణ, ప్రైవేట్ పెట్టుబడులు వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయని, పటిష్టంగా ఉన్న దేశీయ పరిణామాలు దేశ వృద్ధికి ఇంజిన్‌గా మారగలవని నివేదిక వెల్లడించింది. సేవలు, కొన్ని రకాల వస్తువుల ఎగుమతుల్లో సానుకూల వృద్ధి కూడా భారత ఆర్థిక కార్యకలాపాలకు మద్దతివ్వగలవు. సరఫరా వైపు కూడా తయారీ, సేవల రంగాల వృద్ధి కూడా అనుకూలంగా ఉన్నాయని, గతేడాది కంటే 2025లో అన్ని ప్రధాన పంటలు అధిక దిగుబడిని ఇస్తాయని నివేదిక పేర్కొంది.

Next Story