- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ICICI: ప్రథమార్థంలో దేశ జీడీపీ 7.6 శాతం వృద్ధి చెందే అవకాశం: ఐసీఐసీఐ
ఎగుమతులు తగ్గడం, ప్రభుత్వ మూలధన వ్యయం మందగించడం వల్ల ద్వితీయార్థంలో వృద్ధి 6.4 శాతానికి తగ్గవచ్చు

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో భారత జీడీపీ వృద్ధి రేటు 7.6 శాతంగా ఉండవచ్చని ప్రైవేట్ రంగ ఐసీఐసీఐ తన తాజా నివేదికలో తెలిపింది. గతేడాది ఇదే సమయంలో నమోదైన 6.1 శాతం కంటే ఇది ఎక్కువ. ఈ ఏడాది మొదటి రెండు త్రైమాసికాల్లో ఆర్థిక కార్యకలాపాలు బలంగా ఉన్నాయి. ఇందుకు తయారీ, సేవల రంగాలకు తోడు ప్రభుత్వ వ్యయం కొనసాగడం కూడా జీడీపీ వృద్ధికి కీలకంగా మారాయి. ఎగుమతులు తగ్గడం, ప్రభుత్వ మూలధన వ్యయం మందగించడం వల్ల ద్వితీయార్థంలో వృద్ధి 6.4 శాతానికి తగ్గవచ్చు, అయితే మొత్తం వినియోగం స్థిరంగా ఉండే అవకాశం ఉందని కూడా నివేదిక పేర్కొంది. పెట్టుబడుల ఉపసంహరణ, అదనపు వనరుల సేకరణ ద్వారా ఖర్చు చేయగలిగితే ఆర్థిక వృద్ధి స్థిరంగా ఉంటుందని నివేదిక అభిప్రాయపడింది. దీనివల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7 శాతంగా, 2026-27లో 6.5 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. ప్రథమార్థంలో నమోదైన తరహాలోనే, ద్వితీయార్థంలోనూ అంతే వేగవంతమైన వృద్ధి రేటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వినియోగం, పరిశ్రమలు, సేవల రంగాలు సహా అన్ని విభాగాల్లో సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయని, ముఖ్యంగా రెండో త్రైమాసికంలో ప్రకటించిన జీఎస్టీ రేట్ల తగ్గింపు గిరాకీని పెంచుతుందని ఐసీఐసీఐ నివేదిక పేర్కొంది. ఆ తర్వాత మూడవ త్రైమాసికంలోనూ అనేక విభాగాలలో మెరుగైన రిటైల్ అమ్మకాలు జరిగాయి, ఇది వ్యవస్థలో డిమాండ్ కొనసాగడాన్ని ప్రతిబింబిస్తుందని నివేదిక వెల్లడించింది.






