- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Economy: మూడో త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధి 8.1 శాతం
కీలక రంగాల్లో స్థానిక గిరాకీ, వ్యాపార కార్యకలాపాలు వృద్ధికి దోహదపడుతున్నాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: అంతర్జాతీయంగా వాణిజ్య సవాళ్లు ఉన్నప్పటికీ భారత ఆర్థికవ్యవస్థ మునుపటిలాగే అత్యంత వేగవంతమైన వృద్ధిని కొనసాగిస్తుందని ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) తన నివేదికలో పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం(జనవరి-మార్చి)లో దేశ జీడీపీ వృద్ధి దాదాపు 8.1 శాతంగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది. కీలక రంగాల్లో స్థానిక గిరాకీ, వ్యాపార కార్యకలాపాలు వృద్ధికి దోహదపడుతున్నాయి. మరింత సులభంగా చెప్పాలంటే, ప్రజలు ఎక్కువ ఖర్చు చేస్తుండటం, వ్యవసాయం, ఇతర అసంఘటిత రంగాల్లో కార్యకలాపాలు సానుకూలంగా ఉండటం వల్ల వృద్ధికి ఎక్కువ మద్దతు లభిస్తోందని నివేదిక అభిప్రాయపడింది. పండుగ సీజ, ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణల వంటి కీలక చర్యలు పట్టణాల్లోని ప్రజలు ఎక్కువ ఖర్చు చేసేందుకు ఆస్కారం కలిగింది. ఇది కూడా ఆర్థికవ్యవస్థకు కీలక మద్దతుగా నిలిచింది. ఇదే సమయంలో 2025-26 పూర్తి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారత ఆర్థికవ్యవస్థ 7.4 శాతం వృద్ధిని సాధిస్తుందని ఎస్‌బీఐ నివేదిక తెలిపింది. ఇది కూడా దేశీయ డిమాండ్ కారణంగా రానుంది. ప్రభుత్వ గణాంకాలు ఈ నెల 27న విడుదల కానుందని, తమ అంచనాలకు కొంచెం అటూఇటూగా వృద్ధి సాధ్యమేనని నివేదిక పేర్కొంది. కాగా, ప్రభుత్వం ఈసారి విడుదల చేసే జీడీపీ గణాంకాల్లో బేస్ సంవత్సరాన్ని 2011-12 నుంచి 2022-23కి మార్చిన సంగతి తెలిసిందే. ఈ అప్‌డేట్ ద్వారా ప్రస్తుతం మన ఆర్థికవ్యవస్థ ఎలా ఉందో స్పష్టమవుతుంది. ముఖ్యంగా డిజిటల్ వ్యాపారం, సేవల రంగాల ఆధారంగా వృద్ధి గణాంకాలు ఉండనున్నాయి.






