- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Economy: భారత వృద్ధి అంచనాను తగ్గించిన నోమురా
కీలక సూచీల్లో నమోదవుతున్న వ్యత్యాసం కారణంగా దేశ దేశీయోత్పత్తి ప్రభావితం కావొచ్చని నోమురా అభిప్రాయపడింది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధిని సవరిస్తున్నట్టు ప్రముఖ బ్రోజరేజ్ సంస్థ నోమురా సోమవారం ప్రకటనలో తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో 6.5 శాతం మేర వృద్ధి సాధించిన భారత ఆర్థికవ్యవస్థ, 2025-26లో ఇది 6.2 శాతానికి తగ్గవచ్చని అంచనా వేసింది. ఇందుకు ప్రధానంగా జీఎస్టీ వసూళ్లలో రికార్డు స్థాయి పెరుగుదల, వాహన అమ్మకాలు, బ్యాంకుల క్రెడిట్ వృద్ధి వంటి కీలక సూచీల్లో నమోదవుతున్న వ్యత్యాసం కారణంగా దేశ దేశీయోత్పత్తి ప్రభావితం కావొచ్చని నోమురా అభిప్రాయపడింది. ఇటీవల కాలంలో కార్పొరేట్ కంపెనీ ఆదాయాలు తగ్గుతాయనే అంచనాలు, అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, వాణిజ్య అనిశ్చితులు ఉన్నప్పటికీ భారత ఈక్విటీ మార్కెట్లు స్థిరమైన లాభాలను సాధ్సితున్నాయి. దీనికి తోడు దేశీయంగా కీలక గణాంకాలు వృద్ధికి మద్దతిస్తున్నాయని నోమురా నివేదికలో పేర్కొంది. దేశంలో కొనసాగుతున్న మౌలిక సదుపాయాల వ్యయం, ఉత్పాదకత లాభాలు, డిజిటలైజేషన్, ఆర్థికీకరణ సహకారం గణనీయంగా ఉంది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్త అనిశ్చితుల వల్ల ఎగుమతిదారులు స్థానిక రంగాలపై ఆధారపడతారు. ఫలితంగా వృద్ధి కొనసాగుతుందని వెల్లడించింది.






