- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Economy: భారత వృద్ధి అంచనాలను పెంచిన మూడీస్
దేశంలో వేగంగా పెరుగుతున్న డిజిటల్ వినియోగం, ప్రభుత్వం చేపడుతున్న పన్ను, బీమా రంగ సంస్కరణలు దోహదపడుతున్నాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ 7.3 శాతం వృద్ధిని సాధిస్తుందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అంచనా వేసింది. కంపెనీలు పెట్టుబడులు పెట్టడం దగ్గరి నుంచి ఎక్కువ మందికి ఉపాధి లభించడం, ఆదాయాలు పెరగడం, ప్రజలు ఖర్చు చేసే ధోరణి సానుకూలంగా ఉండటం, బీమా రక్షణకు డిమాండ్‌ను పెరగడం వంటి అంశాలు మొత్తం దేశ ఆర్థిక వృద్ధికి దోహదపడుతున్నాయని మూడీస్ అభిప్రాయపడింది. అంతేకాకుండా దేశంలో వేగంగా పెరుగుతున్న డిజిటల్ వినియోగం, ప్రభుత్వం చేపడుతున్న పన్ను, బీమా రంగ సంస్కరణలు దోహదపడుతున్నాయి. ఇదే సమయంలో భారత్‌కు ఎగుమతుల నుంచి మాత్రమే వృద్ధికి మద్దతు లభించడం లేదు, దేశీయ డిమాండ్ వృద్ధికి ప్రధాన కారణమని నివేదిక వెల్లడించింది. గతేడాదిలో 6.5 శాతం నుంచి ఈసారి 7.3 శాతం భారత వృద్ధి ఉంటుందని భావిస్తున్నాం. అధిక వృద్ధి కొనసాగడం వల్ల దేశంలో సగటు ఆదాయం పెరుగుతుంది. ఎక్కువ మంది ఆరోగ్యం, జీవితం, పొదుపు కోసం బీమా పాలసీలను కొనవచ్చని తెలిపింది. ఫలితంగా రానున్న రోజుల్లో దేశ బీమా రంగం ఎక్కువ ప్రయోజనం పొందనుంది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో మొదటి ఎనిమిది నెలలు మొత్తం బీమా ప్రీమియం ఆదాయం 17 శాతం పెరిగి రూ. 10.9 లక్షల కోట్లకు చేరింది. ఆరోగ్య బీమా ప్రీమియంలు 14 శాతం, కొత్త జీవిత బీమా వ్యాపారం 20 శాతం పెరగడమే ఇందుకు కారణం. దేశంలో బీమాకు డిమాండ్ పెరుగుతోంది. ప్రజలు ఆరోగ్యం, ఆర్థిక నష్టాల గురించి ఎక్కువ అవగాహన ఆశిస్తున్నారు. డిజిటలైజేషన్ బీమా కొనుగోలును సులభతరం, వేగవంతం చేసిందని నివేదిక పేర్కొంది.






