- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Forex Reserves: ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి దేశ ఫారెక్స్ నిల్వలు
అంతకుముందు ఫిబ్రవరి 6తో ముగిసిన వారంలో ఫారెక్స్ నిల్వలు 6 బిలియన్ డాలర్లు తగ్గి 717.06 బిలియన్ డాలర్లకు చేరిన సంగతి తెలిసిందే.

దిశ, బిజినెస్ బ్యూరో: మనదేశ మారకపు నిల్వలు ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయికి చేరాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ఈ నెల 13తో ముగిసిన వారంలో భారత విదేశీ మారకపు నిల్వలు 8.66 బిలియన్ డాలర్లు పెరిగి ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయి 725.72 బిలియన్ డాలర్ల(మన కరెన్సీలో ఇది రూ. 66 లక్షల కోట్ల)కు చేరుకున్నాయి. అంతకుముందు ఫిబ్రవరి 6తో ముగిసిన వారంలో ఫారెక్స్ నిల్వలు 6 బిలియన్ డాలర్లు తగ్గి 717.06 బిలియన్ డాలర్లకు చేరిన సంగతి తెలిసిందే. గత నెలలో ఫారెక్స్ నిల్వలు ఎన్నడూ లేని విధంగా 723.77 బిలియన్ డాలర్లకు తాకిన సంగతి తెలిసిందే. సమీక్షించిన వారంలో విదేశీ కరెన్సీ ఆస్తులు 3.55 బిలియన్ డాలర్లు, బంగారం నిల్వలు 4.99 బిలియ డాలర్లు, స్పెషల్ డ్రాయిన్స్ రైట్స్(ఎస్‌డీఆర్) 103 మిలియన్ డాలర్లు పెరిగాయని అధికారిక డేటా వెల్లడించింది. అలాగే, ఐఎంఎఫ్ వద్ద భారత నిల్వలు 19 మిలియన్ డాలర్లు పెరిగి 4.73 బిలియన్ డాలర్లకు చేరాయని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. భారత్ వద్ద విదేశీ మారక నిల్వలు తగినంతగా ఉన్నాయి. దాదాపు ఏడాది పాటు దిగుమతులకు, బయటి రుణాలను దాదాపు 96 శాతం కవర్ చేస్తాయని తెలిపింది. భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, ఇండియా-యూఎస్ డీల్ తర్వాత పెట్టుబడిదారుల సెంటిమెంట్ మెరుగుపడింది. ఫలితంగా విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు, భారత రూపాయి తిరిగి పుంజుకున్నాయని ఆర్‌బీఐ పేర్కొంది.






