- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Exports: సుంకాల కారణంగా భారత ఎగుమతుల్లో రూ. 50 వేల కోట్ల క్షీణత
ఇది మొత్తం అమెరికాకు వెళ్లే ఎగుమతుల్లో 6.41 శాతానికి సమానం.

దిశ, బిజినెస్ బ్యూరో: భారత్‌పై ట్రంప్ 26 శాతం పరస్పర సుంకం విధించాలని తీసుకున్న నిర్ణయం కారణంగా ఈ ఏడాది ఎగుమతులు 5.76 బిలియన్ డాలర్లు(రూ. 49.54 వేల కోట్లు) క్షీణించవచ్చని ఆర్థిక మేధోసంస్థ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్(జీటీఆర్ఐ) సోమవారం ప్రకటనలో తెలిపింది. ఇది మొత్తం అమెరికాకు వెళ్లే ఎగుమతుల్లో 6.41 శాతానికి సమానం. ప్రధానంగా చేపలు, ఇతర సముద్ర ఉత్పత్తులు ఐదో వంతు తగ్గనున్నాయి. ఇనుము, ఉక్కు ఉత్పత్తుల ఎగుమతులు 18 శాతం, వజ్రాలు, బంగారం, సంబంధిత ఉత్పత్తులు 15.3 శాతం, వాహనాలు, విడిభాగాలు 12.1 శాతం, విద్యుత్, టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు 12 శాతం మేర క్షీణిస్తాయని జీటీఆర్ఐ నివేదిక తెలిపింది. ఇతర ఉత్పత్తుల్లో ప్లాస్టిక్ (9.4 శాతం), తివాచీలు (6.3 శాతం), పెట్రోలియం ఉత్పత్తులు (5.2 శాతం), సేంద్రీయ రసాయనాలు (2.2 శాతం), యంత్రాల (2 శాతం) ఎగుమతులు దెబ్బతిననున్నాయి. ఇప్పటికే కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అమెరికా విధించిన పరస్పర సుంకాల కారణంగా భారతీయ ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి పరిశ్రమ ప్రతినిధులు, ఎగుమతిదారులతో సమావేశం వనున్నారు. గతేడాది భారత్ నుంచి 89.81 బిలియన్ డాలర్ల(రూ. 7.72 లక్షల కోట్ల) విలువైన వస్తువుల ఎగుమతులు జరిగాయి.






