- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Exports: 2010-2023 మధ్య భారత ఎగుమతులు భేష్
గత 13 ఏళ్ల కాలంలో ప్రపంచ ఎగుమతుల వాటాలో భారత్ 6.3 శాతంతో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా నిలిచింది.

దిశ, బిజినెస్ బ్యూరో: గడిచిన దశాబ్ద కాలంలో భారత ఎగుమతులు స్థిరమైన వృద్ధిని సాధిస్తున్నాయి. 2010 నుంచి 2023 వరకు భారత ఎగుమతులు మెరుగైన పెరుగుదలను నమోదు చేస్తున్నాయని, ఇది వాణిజ్య రంగ అభివృద్ధిని ప్రతిబింబిస్తుందని ఒక అధికారి తెలిపారు. మంగళవారం నాటి ప్రకటనలో యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్ (యూఎన్‌సీటీఏడీ) నివేదిక గణాంకాలను ప్రస్తావిస్తూ.. గత 13 ఏళ్ల కాలంలో ప్రపంచ ఎగుమతుల వాటాలో భారత్ 6.3 శాతంతో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా నిలిచింది. 2024 ఏడాదికి సంబంధించి అంతర్జాతీయ వాణిజ్య కీలక గణాంకాల ప్రకారం ప్రధాన ఆర్థికవ్యవస్థలలోనే భారత్ అత్యధిక వృద్ధి రేటును నమోదు చేయగలిగింది. ముఖ్యంగా యూరప్, చైనా, యూఎస్ వంటి ప్రధాన ఆర్థికవ్యవస్థల కంటే ఎక్కువ. 2010-2023 మధ్య యూరప్ 3.9 శాతం, చైనా 6.1 శాతం, అమెరికా 3.9 శాతంతో తక్కువ ఎగుమతుల వాటా వృద్ధిని నమోదు చేశాయి. జపాన్, రష్యా వంటి దేశాలు ఎగుమతుల్లో తక్కువ వృద్ధిని చూశాయి. భారత్ మాత్రం వాణిజ్య విధానాలు, తయారీ, సేవల రంగాల్లో రాణిస్తూ, ప్రపంచ సరఫరా పెరగడంలో కీలకపాత్ర పోషించింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 2009-10 ఆర్థిక సంవత్సరంలో భారత మొత్తం ఎగుమతుల విలువ 274.8 బిలియన్ డాలర్లు(రూ. 23.7 లక్షల కోట్లు)గా ఉన్నాయి. అక్కడి నుంచి 2022-23 నాటికి 776.3 బిలియన్ డాలర్లు(రూ. 67 లక్షల కోట్ల)కు, 2024-25లో 825 బిలియన్ డాలర్ల(రూ. 71.22 లక్షల కోట్ల)కు చేరుకున్నాయి.






