Economy: భారత ఆర్థికవ్యవస్థ వృద్ధి అంచనాను తగ్గించిన ఫిక్కీ

by S Gopi |

ముందుగా అంచనా వేసిన 7 శాతం నుంచి 6.4 శాతానికి తగ్గించింది.

Economy: భారత ఆర్థికవ్యవస్థ వృద్ధి అంచనాను తగ్గించిన ఫిక్కీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారత వృద్ధి అంచనాను తగ్గిస్తున్నట్టు పరిశ్రమల సంస్థ ఫిక్కీ గురువారం వెల్లడించింది. ఎకనామిక్ ఔట్‌లుక్ సర్వే ప్రకారం.. ముందుగా అంచనా వేసిన 7 శాతం నుంచి 6.4 శాతానికి తగ్గించింది. దేశ ఆర్థిక వ్యవస్థపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాల అంచనా ప్రభావం కారణంగా అమెరికా వాణిజ్య భాగస్వామ్యంలో ఎగుమతులు, విదేశీ పెట్టుబడులు, ఇన్‌పుట్ ఖర్చుల విషయంలో సవాళ్లు ఉండే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. అమెరికా కొత్త ప్రభుత్వం అధిక సుంకాలు, కఠినమైన ఇమ్మిగ్రేషన్ నిబంధనలు, ద్రవ్యోల్బణాన్ని పెంచవచ్చని తెలిపారు. అలాగే, ఫెడ్ పాలసీ రేట్లను ఊహించిన దానికంటే స్వల్పంగా తగ్గించవచ్చు. దీనివల్ల భారత్‌తో పాటు అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో పెట్టుబడులు తగ్గనున్నాయి. అంతేకాకుండా ఈ పరిణామాల ప్రభావంతో భారత కరెన్సీ రూపాయిపై ఒత్తిడి కలిగించవచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. రానున్న కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రైవేట్ వినియోగాన్ని పెంచే కీలక చర్యలు తీసుకోవాలని, ప్రత్యక్ష, పరోక్ష పన్నులు సహా ప్రస్తుత పన్నుల విధానంపై సమీక్ష జరిపి ఆదాయాన్ని పెంచేలా, వినియోగ వ్యయాన్ని ప్రోత్సాహించే చర్యలు ఉండాలని సూచించారు.

Next Story