Data Usage: దేశంలో సగటున నెలకు 31జీబీ డేటా వాడకం

by S Gopi |   (  Updated:2026-03-31 15:05:42  IST  )

దేశవ్యాప్తంగా నెలవారీ సగటు డేటా వాడకం ఏకంగా 31జీబీకి చేరింది. ఇది 2024లో 27.5జీబీ కంటే చాలా ఎక్కువ.

Data Usage: దేశంలో సగటున నెలకు 31జీబీ డేటా వాడకం
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో మొబైల్ డేటా వినియ్గం అత్యంత వేగంగా పెరుగుతోంది. టెలికాం పరికరాల తయారీ సంస్థ నోకియా తాజాగా విడుదల చేసిన నోకియా వార్షిక 'మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ ఇండెక్స్' (ఎంబీఐటీ) 13వ ఎడిషన్‌ ప్రకారం, గతేడాది దేశవ్యాప్తంగా నెలవారీ సగటు డేటా వాడకం ఏకంగా 31జీబీకి చేరింది. ఇది 2024లో 27.5జీబీ కంటే చాలా ఎక్కువ. అదేవిధంగా 2025లో దేశవ్యాప్తంగా నెలవారీ 5జీ డేటా వినియోగం గతంతో పోలిస్తే 70 శాతంతో భారీగా పెరిగి, 12.9 ఎక్సాబైట్‌ల (ఈబీ) స్థాయికి చేరుకుంది. 1 ఎక్సాబైట్ అంటే 100 కోట్ల జీబీలకు సమానం. దీని ప్రకారం, దేశంలో మొబైల్ మొబైల్ బ్రాండ్ ట్రాఫిక్‌లో 5జీ వాటా 47 శాతానికి చేరింది. దీంతో గడిచిన ఐదేళ్లుగా మొబైల్ డేటా వినియోగం ఏటా సగటున 18 శాతం పెరుగుతోందని నివేదిక తెలిపింది. దీనికి ప్రధానంగా ఏఐ యాప్‌ల వాడకం పెరిగిపోవడం, 4కే వీడియో స్ట్రీమింగ్, క్లౌడ్ గేమింగ్ కోసం అధిక డేటా వినియోగం అత్యధికంగా నమోదైందని, మొత్తంగా దేశంలో అన్ని రకాల డేటా వినియోగం 2025లో నెలకు సగటున 27 ఎక్సాబైట్లు దాటినట్టు నివేదిక పేర్కొంది.

బ్యాంకు అకౌంట్ పోర్టబిలిటీ తెచ్చే యోచనలో ఆర్‌బీఐ

Next Story