- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Auto Sales: వాహనాల రిటైల్ అమ్మకాలకు జీఎస్టీ బూస్ట్
గతేడాది పండుగ సీజన్‌కు ముందు కేంద్రం ప్రకటించిన జీఎస్టీ సంస్కరణలకు దోహదపడ్డాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ వాహన పరిశ్రమలో కంపెనీలు సరికొత్త రికార్డు అమ్మకాలను సాధించాయి. ఈ ఏడాది జనవరిలో దేశీయ ఆటో పరిశ్రమ రిటైల్ అమ్మకాలు దాదాపు 18 శాతం పెరిగి 27 లక్షల యూనిట్లకు చేరాయని డీలర్ల సంఘం ఫాడా మంగళవారం ప్రకటనలో వెల్లడించింది. గతేడాది పండుగ సీజన్‌కు ముందు కేంద్రం ప్రకటించిన జీఎస్టీ సంస్కరణలకు దోహదపడ్డాయి. గత నెలలో పంటకోత, వివాహ వేడుకల సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో గిరాకీ సానుకూలంగా ఉండటం వంటి అంశాలు కూడా అమ్మకాలు పెరిగేందుకు ప్రధాన కారణాలు. ఫాడా డేటా ప్రకారం, జనవరిలో మొత్తం రిటైల్ అమ్మకాలు 27,22,558 యూనిట్లకు చేరాయి. గతేడాది ఇదే నెలలో 23,14,940 యూనిట్లతో పోలిస్తే ఇది 17.61 శాతం పెరిగింది. ఇందులో ప్యాసింజర్ వాహనాల రిటైల్ అమ్మకాలు 7 శాతం పెరిగి 5,13,475 యూనిట్లుగా నమోదయ్యాయి. మెట్రో ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో అమ్మకాలు 14.43 శాతం పెరిగాయి. పట్టణ ప్రాంతాల్లో మాత్రం 2.75 శాతం వృద్ధి నమోదైంది. ముఖ్యంగా ఎస్‌యూవీ, కాంపాక్ట్ ఎస్‌యూవీ, ఎంట్రీ-లెవల్ కార్లకు తిరిగి డిమాండ్ కనిపిస్తోందని ఫాడా అధ్యక్షుడు సీ ఎస్ విఘ్నేశ్వర్ పేర్కొన్నారు. ద్విచక్ర వాహన విభాగంలో 18,52,870 యూనిట్లు, త్రీ-వీలర్ విభాగంలో 19 శాతం, కమర్షియల్ విభాగంలో 15 శాతం అమ్మకాలు పెరిగాయి. ట్రాక్టర్ అమ్మకాలు అధికంగా 23 శాతం పెరిగాయని ఫాడా వెల్లడించింది.






