Amazon: 10 నిమిషాల్లో డెలివరీ.. సేవలు ప్రారంభించిన అమెజాన్

by S Gopi |

గురువారం అమెజాన్ దేశ రాజధాని ఢిల్లీలో 10 నిమిషాల్లో డెలివరీ సేవలను ప్రారంభించింది.

Amazon: 10 నిమిషాల్లో డెలివరీ.. సేవలు ప్రారంభించిన అమెజాన్
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత్‌లో అత్యంత వేగంగా పెరుగుతున క్విక్-కామర్స్ మార్కెట్లో ఆధిపత్యం కోసం పోటీ తీవ్రమవుతోంది. ఈ విభాగంలో తక్కువ సమయంలోనే సరుకులు, వస్తువుల డెలివరీ అందించే వీలుండటంతో యూజర్లు ఈ సేవలను ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు. ఇప్పటికే ఇందులో 10 నిమిషాల్లో డెలివరీ అందిస్తూ బ్లింక్ఇట్, ఇన్‌స్టామార్ట్, జెప్టో వంటి కంపెనీలు రాణిస్తుండగా, ఈ విభాగంలో గ్లోబల్ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కూడా ఎంట్రీ ఇచ్చింది. గురువారం అమెజాన్ దేశ రాజధాని ఢిల్లీలో 10 నిమిషాల్లో డెలివరీ సేవలను ప్రారంభించింది. ఈ కొత్త తరహా సేవలకు సంబంధించి వినియోగదారుల స్పందన, ఫీడ్‌బ్యాక్ కోసం ఎదురుచూస్తున్నామని అమెజాన్ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఢిల్లీలోనే ఈ సేవలు మొదలైనప్పటికీ వచ్చే మరికొన్ని నెలల్లో మరిన్ని నగరాలకు ఈ సేవలు విస్తరించనున్నట్టు కంపెనీ వెల్లడించింది. ఈ సేవల ద్వారా పట్టణ ప్రాంతాల్లో కస్టమర్లు ఆన్‌లైన్ షాపింగ్ ద్వారా కిరాణా సామగ్రి, గాడ్జెట్‌ల నుంచి దుస్తులు, ఎలక్ట్రానిక్స్ వరకు అమెజాన్ లభించే చాలా వస్తువులను తక్కువ సమయంలో డెలివరీ అందుకుంటారని కంపెనీ వివరించింది.

Next Story