Rupee: కొత్త రికార్డు పతనానికి భారత రూపాయి.. రంగంలోకి ఆర్‌బీఐ

by S Gopi |

సమీప కాలంలో ఇదే ధోరణి కొనసాగితే రూపాయి రూ. 90.70 స్థాయికి క్షీణించవచ్చని దిలీప్ పర్మార్ అన్నారు.

Rupee: కొత్త రికార్డు పతనానికి భారత రూపాయి.. రంగంలోకి ఆర్‌బీఐ
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత కరెన్సీ రూపాయి రోజురోజుకు ఒత్తిడిని ఎదుర్కుంటోంది. గురువారం మరింత పతనం కావడంతో చరిత్రలోనే కనిష్టానికి చేరింది. బడా కార్పొరేట్ కంపెనీలు ఎక్కువగా డాలర్లను కొనుగోలు చేయడం, అమెరికాతో వాణిజ్య ఒప్పందం వైపు స్పష్టమైన పురోగతి లేకపోవడం వంటి కారణాలతో గురువారం భారత రూపాయి రూ. 90.46కి క్షీణించింది. డిసెంబర్ 4 నాటి మునుపటి రికార్డు స్థాయి రూ. 90.42 కంటే ఇది మరింత పతనమైంది. సమీప కాలంలో ఇదే ధోరణి కొనసాగితే రూపాయి రూ. 90.70 స్థాయికి క్షీణించవచ్చని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీ విదేసీ మారక ద్రవ్య విశ్లేషకులు దిలీప్ పర్మార్ అన్నారు.

రంగంలోకి ఆర్‌బీఐ

రూపాయి పతనమ కొత్త రికార్డులకు పడిపోతుండటంతో భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) రంగంలోకి దిగింది. ఆర్‌బీఐ పరిమితంగానే జోక్యం చేసుకుంటున్నప్పటికీ, పతనమయ్యే వేగాన్ని నియంత్రించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటుందని రాయిటర్స్ తెలిపారు. ప్రపంచ ఆర్థిక ఒత్తిళ్ల మధ్య రూపాయి స్థిరత్వాన్ని కాపాడేందుకు ప్రయత్నమని పేర్కొన్నారు. ఇందులో భాగంగా దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో డాలర్లను విక్రయించడం ద్వారా రూపాయి విలువను కాపాడేందుకు చూస్తోంది. లండన్, సింగపూర్, దుబాయ్ లాంటి చోట్ల ప్రధాన బ్యాంకులతో కలిసి నాన్-డెలివరబుల్ ఫార్వార్డ్స్ లాంటి డెరివేటివ్ కాంట్రాక్టుల ద్వారా చర్యలు తీసుకుంటోంది.

Next Story