ఆల్ టైమ్ కనిష్ఠానికి రూపాయి.. ఒక్కరోజే భారీగా పతనం

by Naga Rani Yarlagadda |

డాలర్ వద్ద భారత కరెన్సీ రూపాయి చారిత్రక కనిష్ఠానికి పతనమైంది.

ఆల్ టైమ్ కనిష్ఠానికి రూపాయి.. ఒక్కరోజే భారీగా పతనం
X

దిశ, వెబ్‌డెస్క్: డాలర్ వద్ద భారత కరెన్సీ రూపాయి చారిత్రక కనిష్ఠానికి పతనమైంది. శుక్రవారం డాలర్ తో పోలిస్తే.. రూపాయి విలువ ఏకంగా 98 పైసలు నష్టపోయి.. రూ.89.66 వద్ద ముగిసింది. రూపాయి విలువ 89 మార్క్‌ను దాటడం ఇదే తొలిసారి. 2022 ఫిబ్రవరి 24న రూపాయి 99 పైసలు నష్టపోయింది. గడిచిన మూడేళ్లలో ఎన్నడూలేని రీతిలో ఒక్కరోజులోనే రూపాయి 98 పైసలు నష్టపోయింది. ఏడాది కాలంలో ఇప్పటి వరకూ రూపాయి విలువ 4.6 శాతం మేర క్షీణించి.. ఆసియాలోనే అత్యంత బలహీనపడిన కరెన్సీగా నిలిచింది.

దిగుమతిదారుల నుంచి డాలర్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరగడం, అంతర్జాతీయ డాలర్ ఇండెక్స్ బలపడటం రూపాయిపై తీవ్ర ఒత్తిడిని పెంచాయని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. భారత్ ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేస్తుండటంతో అమెరికా ఆంక్షలు విధించడం, టెక్నాలజీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి, విదేశీ పెట్టుబడుల తరలింపు వంటి అంశాలు కూడా ప్రతికూలమైన ప్రభావం చూపాయి. త్వరలోనే రూపాయి విలువ 90 మార్క్ ను కూడా దాటవచ్చని యా వెల్త్ గ్లోబల్ రీసెర్చ్ డైరెక్టర్ అనూజ్ గుప్తా అంచనా వేశారు.

Next Story