- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Railways: టికెట్ క్యాన్సిలేషన్ రూల్స్ సవరించిన భారతీయ రైల్వే
ఏప్రిల్ 1-15 మధ్య దశలవారీగా అమల్లోకి వచ్చే ఈ మార్పుల్లో ప్రధానంగా, టికెట్ క్యాన్సిలేషన్ సమయాన్ని మార్చారు.

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ రైల్వే టికెట్ క్యాన్సిలేషన్ విధానాల్లో కీలక సవరణలు చేసింది. ట్రైన్ బయలుదేరే సమయాన్ని బట్టి రీఫండ్లలో మార్పులు తీసుకొచ్చింది. ఏప్రిల్ 1-15 మధ్య దశలవారీగా అమల్లోకి వచ్చే ఈ మార్పుల్లో ప్రధానంగా, టికెట్ క్యాన్సిలేషన్ సమయాన్ని మార్చారు. కొత్త రూల్స్ ప్రకారం, ట్రైన్ బయలుదేరే 72 గంటల ముందు క్యాన్సిల్ చేస్తే క్యాన్సిలేషన్ ఛార్జీలకు అనుగుణంగా మొత్తం రీఫండ్ చేయనున్నారు. ఈ మేరకు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. ప్రయాణ సమయానికి 72 గంటల ముందు టికెట్ క్యాన్సిల్ చేస్తే మ్యాగ్జిమమ్ రీఫండ్, తక్కువ క్యాన్సిలేషన్ ఛార్జీలు ఉంటాయి. అదేవిధంగా ట్రైన్ బయలుదేరడానికి 72-24 గంటల మధ్య క్యాన్సిల్ చేస్తే టికెట్ ధరలో 25 శాతం మినహాయించి, కనీస ఛార్జీలతో రీఫండ్ చేయనున్నారు. 24-8 గంటల మధ్య క్యాన్సిల్ చేస్తే 50 శాతం మినహాయించి, ఛార్జీలు పోనూ మిగిలిన మొత్తం రీఫండ్ అవుతుంది. ఇక, ట్రైన్ బయలుదేరే సమయానికి 8 గంటల ముందు టికెట్ క్యాన్సిల్ చేస్తే ఎలాంటి రీఫండ్ ఉండదు. గతంలో ఇది 4 గంటలు ముందు వరకు అవకాశం ఉండేది.
మరిన్ని మార్పులు
ట్రైన్ బయలుదేరే 30 నిమిషాలకు ముందు ప్రయాణికులు బోర్డింగ్ పాయింట్ మార్చుకునే సదుపాయాన్ని రైల్వే శాఖ తీసుకొచ్చింది. ఎక్కువ స్టేషన్లు ఉన్న నగరాల్లోని వారికి ఇది ఉపయోగపడుతుంది. ప్రస్తుత ఇది చార్ట్ ప్రిపేర్‌కు ముందు మాత్రమే అవకాశం ఉంది. అలాగే, ఇప్పుడు ఏ స్టేషన్‌లోనైనా టికెట్ క్యాన్సిల్ చేసుకునే వీలు కల్పించారు. అలాగే, ఈ-టికెట్ ఉన్న ప్రయాణికులు టికెట్ డిపాజిట్ రిసీట్(టీడీఆర్) ఫైల్ చేసేందుకు మ్యానువల్ ప్రక్రియ నుంచి, దీన్ని ఆటోమెటిక్ విధానంలో రీఫండ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే త్వరలో కన్ఫర్మ్ టికెట్ల రీషెడ్యూల్ (తేదీ మార్పు)ను క్యాన్సిలేషన్ ఛార్జీలు లేకుండా చేసుకునే కొత్త ఫీచర్‌ను కూడా తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు మంత్రి వెల్లడించారు.






