పండుగలకు ఊరెళ్లేవారికి రైల్వేశాఖ బంపరాఫర్.. టికెట్ పై భారీగా డిస్కౌంట్

by Naga Rani Yarlagadda |

రైల్వే ప్రయాణికుల కోసం భారతీయ రైల్వే (Indian Railway) కొత్త పథకాన్ని తీసుకొచ్చింది.

పండుగలకు ఊరెళ్లేవారికి రైల్వేశాఖ బంపరాఫర్.. టికెట్ పై భారీగా డిస్కౌంట్
X

దిశ, వెబ్‌డెస్క్: రైల్వే ప్రయాణికుల కోసం భారతీయ రైల్వే (Indian Railway) కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. రౌండ్ ట్రిప్ ప్యాకేజీ (Round Trip Package)గా తెచ్చిన ఈ పథకం కింద రైల్వే ప్రయాణికులకు ఇకపై డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు తెలిపింది. దసరా, దీపావళి, ఛత్ పూజ పండుగలకు ఊరెళ్లే ప్రయాణికులే తిరుగు ప్రయాణంలోనూ ఉంటే.. టికెట్‌పై 20 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. ఇరువైపులా ప్రయాణికుల సంఖ్యను పెంచుకోవడం కోసమే టికెట్‌పై డిస్కౌంట్‌ను ప్రకటించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. తిరుగు ప్రయాణానికి మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుందని, బుకింగ్ కూడా ఒకే క్లాస్‌లో, ఒకే స్టేషన్ నుంచి ఉండాలని స్పష్టం చేశారు.

ఆగస్టు 14వ తేదీ నుంచి ఈ రౌండ్ ట్రిప్ ప్యాకేజీ పథకం అమల్లోకి వస్తుందని ఇండియన్ రైల్వే తెలిపింది. రాయితీ ఛార్జీలపై ఎలాంటి రైల్వే కూపన్లు, వోచర్ ఆధారిత బుకింగ్, పాస్ లు అనుమతించబడవని వెల్లడించింది. కాగా.. పండుగల సమయంలో రైళ్లలో రద్దీ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్లీపర్ కోచ్ లు కూడా ఫుల్ అయి.. జనం కిక్కిరిసిపోతుంటారు. ఎన్ని ప్రత్యేక రైళ్లు వేసినా.. సొంతూళ్లకు వెళ్లేవారితో రైళ్లన్నీ కిటకిటలాడుతుంటాయి.

Next Story