Post Office Scheme: మహిళలకు బిగ్ షాక్.. ఆ పోస్టాఫీస్ స్కీమ్ నిలిపివేత

by Vennela |

Post Office Scheme: రెండేళ్ల క్రితం ప్రవేశపెట్టిన మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీముకు తపాలా శాఖ స్వస్తి పలికింది.

Post Office Scheme: మహిళలకు బిగ్ షాక్.. ఆ పోస్టాఫీస్ స్కీమ్ నిలిపివేత
X

దిశ, వెబ్ డెస్క్: Post Office Scheme: రెండేళ్ల క్రితం ప్రవేశపెట్టిన మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీముకు తపాలా శాఖ స్వస్తి పలికింది. మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు అతి తక్కువ కాల వ్యవధిలో అతి ఎక్కువ వడ్డీ రేటు అందించే ఈ స్కీముకు స్వల్ప కాలంలోనే మంచి ఆదరణ లభించింది. అయితే విచారకరమైన విషయం ఏంటంటే 2023 ఫిబ్రవరిలో ప్రారంభించిన ఈ స్కీమును 2025 మార్చి31తో ముగించేశారు.

MSSC స్కీములో మహిళలు రూ. వెయ్యి నుంచి రూ. 2లక్షల వరకు పోస్టాఫీసు అకౌంట్లో డిపాజిట్ చేయవచ్చు. ఈ స్కీము కింద ఖాతా తెరిచి రూ. 2లక్షల లోపు జమ చేసిన మొత్తానికి 7.5శాతం వడ్డీ రేటును చెల్లిస్తారు. అంటే ఈ అకౌంట్లో కనిష్టంగా రూ. వెయ్యి జమ చేస్తే రూ. 160 ..గరిష్టంగా రూ. 2లక్షలు జమ చేస్తే రూ. 32,044వడ్డీని కాలపరిమితి ముగిసేలోపు పొందవచ్చు. ఒక మహిళ మూడు నెలల వ్యవధిలో మరో ఖాతా తీసుకోవచ్చు. ఇలా ఖాతా మెచ్యూరిటీ వ్యవధి రెండేళ్లు. గరిష్ట పరిమితికి లోబడి ఒక మహిళ 3 నెలల అంతరంతో ఎన్ని ఖాతాలైనా తీసుకోవచ్చు. వడ్డీని కూడా త్రైమాసిక పద్ధతిలోనే జమ చేస్తారు.

అయితే మరో విషయం ఏంటంటే ఇప్పటికే అత్యధిక వడ్డీ తో బాలికలకు సుకన్య సమృద్ధి యోజన పథకం అమలు చేస్తోన్న పోస్టల్ శాఖ వయోపరిమితితో ప్రమేయం లేకుండా ఈ స్కీమును అమలు చేసింది. అంటే అమ్మాయికి సుకన్య ఖాతా తెరవ లేకపోయిన తల్లిదండ్రులు చింతలేకుండా ఎంఎస్ఎస్సీ సర్టిఫికేట్ తో భరోసా కల్పించవచ్చు. అయితే పోస్టాఫీసులో మహిళలను ఆకర్షించే స్కీములు లేకపోవడంతో పాటు స్వయం ఉపాధి పనులు చేసుకోలేని గ్రుహిణులు ఎంఎస్ఎస్సీ సర్టిఫికేట్ స్కీమ్ వరంగా మారింది. ఈ స్కీము గురించి మహిళలకు పెద్దగా తెలియకముందే ఇది ముగిసిపోవడం విచారకరమన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Next Story