Indian Passport: హెన్లీ ఇండెక్స్‌లో 75వ స్థానానికి భారత పాస్‌పోర్ట్

by S Gopi |

2025లో భారత పాస్‌పోర్ట్ 85వ అత్యంత శక్తివంతమైనదిగా నిలిచింది.

Indian Passport: హెన్లీ ఇండెక్స్‌లో 75వ స్థానానికి భారత పాస్‌పోర్ట్
X

దిశ, బిజినెస్ బ్యూరో: అంతర్జాతీయంగా అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌లను అంచనా వేసే ప్రముఖ ‘హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2026’ నివేదిక విడుదలైంది. ఇందులో భారత పాస్‌పోర్ట్ ర్యాంక్ గణనీయంగా మెరుగుపడింది. గతేడాదితో పోలిస్తే 10 స్థానాలు ఎగబాకిన భారత పాస్‌పోర్ట్ 75వ ర్యాంకును సాధించింది. 2025లో భారత పాస్‌పోర్ట్ 85వ అత్యంత శక్తివంతమైనదిగా నిలిచింది. ర్యాంకు మెరుగుపడటంతో అంతర్జాతీయంగా భారతీయ పౌరుల ప్రయాణం గణనీయంగా మెరుగుపడింది. ప్రస్తుతం భారత పాస్‌పోర్ట్ ఉన్నవారు మొత్తం 56 దేశాలకు వీసా లేకుండా లేదా అరైవల్ వీసా, ఈ-వీసా సౌకర్యంతో ప్రయాణాలు చేయవచ్చు. దాదాపు 17 ఏళ్ల తర్వాత భారత్ ఈ స్థాయి ర్యాంకును సాధించింది. ఇక, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టుల జాబితాలో సింగపూర్ అగ్రస్థానంలో ఉండగా, జపాన్, దక్షిణ కొరియా, స్వీడన్, యూఏఈ దేశాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

Next Story