- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Online Shopping: ఆన్‌లైన్ షాపింగ్‌లో భారతీయులకు ఏటా రూ. 28,000 కోట్ల నష్టం
ఆన్‌లైన్ కస్టమర్లలో ఏకంగా 88 శాతం మంది.. ఇలాంటి ట్రిక్స్ వల్ల ప్రతి నెలా సగటున రూ. 78 నుంచి రూ. 87 వరకు అదనంగా నష్టపోతున్నారు.

దిశ, బిజినెస్ బ్యూరో: మన దేశంలో ఆన్‌లైన్ షాపింగ్ ఎంత వేగంగా పెరుగుతుందో.. కస్టమర్లను మోసం చేసి జేబులు గుల్ల చేసే ‘డార్క్ ప్యాటర్న్స్’ పద్దతి కూడా అంతే వేగంగా పెరుగుతోంది. ప్రముఖ మార్కెట్ రీసెర్చ్ సంస్థ 'డేటమ్ ఇంటెలిజెన్స్' తాజా నివేదిక ప్రకారం.. ఈ-కామర్స్, క్విక్ కామర్స్, ఆన్‌లైన్ ట్రావెల్ యాప్స్ వాడుతున్న ఈ ‘డార్క్ ప్యాటర్న్స్’ కారణంగా భారతీయ కస్టమర్లు ఏటా రూ. 25,000 కోట్ల నుంచి రూ. 28,000 కోట్ల వరకు నష్టపోతున్నారు. షాపింగ్ ముగించి బిల్లు కట్టే (చెక్అవుట్) సమయంలో అకస్మాత్తుగా యాడ్ అయ్యే 'హ్యాండ్లింగ్ ఫీజులు', మనకు తెలియకుండానే ముందే టిక్ చేసి పెట్టే ఇన్సూరెన్స్ లాంటి అదనపు సేవలు, 'ఇంకో 2 నిమిషాల్లో ఆఫర్ క్లోజ్ అవుతుంది' అంటూ క్రియేట్ చేసే తప్పుడు అర్జన్సీ, క్యాన్సిల్ చేయడానికి వీలులేని సబ్‌స్క్రిప్షన్ ఉచ్చు.. వీటన్నింటినీ డార్క్ ప్యాటర్న్స్ అంటారు. దేశంలోని 30 కోట్ల మందికి పైగా ఆన్‌లైన్ కస్టమర్లలో ఏకంగా 88 శాతం మంది.. ఇలాంటి ట్రిక్స్ వల్ల ప్రతి నెలా సగటున రూ. 78 నుంచి రూ. 87 వరకు అదనంగా నష్టపోతున్నారు. ముఖ్యంగా 63 శాతం మంది కస్టమర్లు ఈ డ్రిప్ ప్రైసింగ్ బాధితులేనని ఈ నివేదిక తేల్చింది.
మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ రకమైన డిజిటల్ మోసాల గురించి అవగాహన ఉన్నవారిలో కూడా 85 శాతం మంది.. ఈ యాప్స్ క్రియేట్ చేసే అర్జెన్సీకి లొంగిపోయి అదనపు డబ్బులు చెల్లించేస్తున్నారు. అలాగే, ప్రధాన ఈ-కామర్స్ యాప్స్‌లో కస్టమర్లు అమెజాన్‌ను అత్యంత నమ్మకమైన బ్రాండ్‌గా తేల్చగా, ఫ్లిప్‌కార్ట్ విషయంలో మాత్రం కస్టమర్లకు నమ్మకం కంటే అనుమానాలే ఎక్కువగా ఉన్నాయి. అటు ట్రావెల్ బుకింగ్స్ విభాగంలో మేక్‌మైట్రిప్‌కు మంచి రేటింగ్ లభించింది. అయితే, కంపెనీలు తమ బిజినెస్ పెంచుకోవడానికి ఇలాంటి దొడ్డిదారులు వెతుకుతున్నా.. 74 శాతం మంది కస్టమర్లు మాత్రం తాము అదనంగా రెండు రూపాయలు ఎక్కువైనా ఇస్తాం కానీ, ఎలాంటి దాపరికం లేకుండా పారదర్శకంగా, నిజాయితీగా వ్యవహరించే యాప్స్‌నే వాడుతామని తేల్చి చెబుతున్నారు.






