- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
FICCI: రూ. 2.5 లక్షల కోట్లకు భారతీయ మీడియా, వినోద రంగం
యానిమేషన్, వీఎఫ్ఎక్స్ వ్యాపారం దెబ్బతినడం వల్ల అనుకున్న దానికంటే వృద్ధి నెమ్మదించింది.

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ మీడియా, వినోద పరిశ్రమ 2024లో రూ. 2.5 లక్షల కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 3.3 శాతం పెరిగింది. పరిశ్రమ అత్యంత వేగంగా వృద్ధి చెందుతోందని పరిశ్రమ సంఘం ఫిక్కీ, ఈవై సంయుక్త నివేదిక వెల్లడించింది. దేశ జీడీపీకి పరిశ్రమ 0.73 శాతం మేర సహకారం అందిస్తోంది. సబ్‌స్క్రిప్షన్ రాబడి క్షీణించడం, యానిమేషన్, వీఎఫ్ఎక్స్ వ్యాపారం దెబ్బతినడం వల్ల అనుకున్న దానికంటే వృద్ధి నెమ్మదించింది. ఈ విభాగాలు పుంజుకుంటే 2025లోపు మీడియా, వినోద పరిశ్రమ 7.2 శాతం వృద్ధి చెంది రూ. 2.68 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. మొత్తం పరిశ్రమలో ప్రకటనల ఆదాయం 8.1 శాతం, ఈవెంట్లు 15 శాతం పెరిగాయి. రేడియో, బహిరంగ ప్రకటనలు మెరుగైన వృద్ధిని సాధించాయి. అలాగే, డిజిటల్ యాడ్స్ 17 శాతం పెరిగి రూ. 70,000 కోట్లకు చేరుకున్నాయి. ఇది మొత్తం ప్రకటనల ఆదాయంలో 55 శాతానికి పెరిగింది. దీనికి ప్రధానంగా ఈ-కామర్స్, సోషల్ మీడియా వంటి ప్లాట్‌ఫామ్ యాడ్స్ ఎక్కువ సహకారం అందించాయి. పెయిడ్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్లు 70 లక్షల నుంచి 1.05 కోట్లకు పెరిగాయి. ఇక, న్యూస్ సబ్‌స్క్రిప్షన్లు స్థిరంగా 31 లక్షలుగా ఉన్నాయి. మరోవైపు టీవీ, ప్రింట్ విభాగాల్లో సబ్‌స్క్రిప్షన్ ఆదాయం పడిపోయిందని మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రతినిధి ఆశిష్ ఫెర్వానీ చెప్పారు. చాలామంది యూట్యూబ్ లాంటి డిజిటల్ మాధ్యమాలకు మారుతుండటంతో సబ్‌స్క్రిప్షన్ విభాగంలో సుమారు 60-70 లక్షల కస్టమర్లు తగ్గారు. ఫలితంగా ఆదాయం గణనీయంగా క్షీణించిందని చెప్పారు. బాక్సాఫీస్ వద్ద చాలా సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో థియేట్రికల్ వ్యాపారం 5.6 శాతం తగ్గింది. ఇదే సమయంలో రియల్ మనీ గేమింగ్‌లపై ప్రభుత్వం జీఎస్టీ అమలు చేసిన నేపథ్యంలో గేమింగ్ ఆదాయం 9 శాతం మేర క్షీణించింది. దీనివల్ల దేశంలో యానిమేటెడ్ కంటెంట్ కూడా ప్రభావితమైందని నివేదిక పేర్కొంది.






