Nasscom: ఎఫ్‌టీఏతో యూరప్‌లో భారతీయ ఐటీ సంస్థలకు మెరుగైన అవకాశాలు

by S Gopi |

ప్రస్తుతం యూరప్ భారతీయ ఐటీ సేవల సంస్థలకు ఆశాజనకమైన కేంద్రంగా అభివృద్ధి చెందుతోంది. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్ లాంటి సంస్థలు విస్తరిస్తున్నాయి.

Nasscom: ఎఫ్‌టీఏతో యూరప్‌లో భారతీయ ఐటీ సంస్థలకు మెరుగైన అవకాశాలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రతిష్టాత్మక ఇండియా-యూరోపియన్ యూనియన్(ఈయూ) స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ) జరగడం పట్ల ఐటీ పరిశ్రమల సంఘం నాస్కామ్ హర్షం వ్యక్తం చేసింది. ఈ ఒప్పందం ద్వారా దేశంలోని టెక్ పరిశ్రమకు మెరుగైన ఈయూ మార్కెట్ యాక్సెస్ లభిస్తుంది. ప్రస్తుతం యూరప్ భారతీయ ఐటీ సేవల సంస్థలకు ఆశాజనకమైన కేంద్రంగా అభివృద్ధి చెందుతోంది. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్ లాంటి సంస్థలు విస్తరిస్తున్నాయి. ఎఫ్‌టీఏ ద్వారా ఆయా కంపెనీలకు మరిన్ని ఒప్పందాలను సాధించడానికి సహాయపడుతుంది. వస్తువులపై గణనీయంగా సుంకాలు తగ్గనున్నప్పటికీ, సేవల రంగ లాభాల వల్ల మార్కెట్లో మరింత యాక్సెస్ లభిస్తుందని, నిబంధనల సడలింపు కలిసొస్తుందని నాస్కామ్ అభిప్రాయపడింది. ముఖ్యంగా ఎఫ్‌టీఏ ఖరారు కావడంతో భారతీయ ఐటీ ప్రొఫెషనల్స్‌కు అవకాశాలు మెరుగుపడతాయి. స్కిల్స్ ఉన్న ఉద్యోగులను సులభంగా బదిలీ చేయవచ్చని, సేవలను సజావుగా సరిహద్దు దాటేందుకు, సురక్షితమైన డేటా సరఫరాకు వీలవుతుంది. ఈ ఒప్పందంలో టెక్నాలజీ చిన్న భాగం కాదని నిపుణులు అంటున్నారు. ఇది భారత్‌ను ప్రపంచ ఐటీ లీడర్‌గా గుర్తిస్తుంది. డిజిటల్ వాణిజ్యం, ఈ-సేవలు, డేటా భద్రత, డిజిటల్ అథంటికేషన్‌ను ప్రోత్సహిస్తుంది. భారతీయ టెక్ కంపెనీలు యూరప్ డిజిటల్ ఆర్థిక వ్యవస్థతో మరింత లోతుగా కనెక్ట్ అవ్వడానికి సహాయపడుతుందని నాస్కామ్ పేర్కొంది.

Next Story