- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IPOs: అక్టోబర్‌లో ఐపీఓ మార్కెట్ రికార్డు.. 5 బిలియన్ డాలర్ల సేకరణ
ఈ రెండు కంపెనీల ఐపీఓలు అతిపెద్ద ఐపీఓలుగానే కాకుండా ఎక్కువమంది ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్న ముఖ్యమైన ఐపీఓలుగా ఉన్నాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ స్టాక్‌మార్కెట్లో చాలారోజుల తర్వాత ఐపీఓల సందడి కనిపిస్తోంది. చాలా కంపెనీలు మార్కెట్లోకి అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో మునుపెన్నడూ లేనిస్థాయిలో అక్టోబర్ నెలలో 5 బిలియన్ డాలర్లను సమీకరించనున్నాయి. ముఖ్యంగా టాటా కేపిటల్, ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ వంటి బడా ఐపీఓలు వచ్చేవారం నుంచి సబ్‌స్క్రిప్షన్ కోసం అందుబాటులో రానున్నాయి. ఈ రెండు కంపెనీల ఐపీఓలు అతిపెద్ద ఐపీఓలుగానే కాకుండా ఎక్కువమంది ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్న ముఖ్యమైన ఐపీఓలుగా ఉన్నాయి. భారతీయ వస్తువులపై అమెరికా 50 శాతం టారిఫ్‌లు విధించడం, కార్పొరేట్ ఆదాయాలు తగ్గడం వల్ల మిగిలిన ఆసియా మార్కెట్లు ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. కానీ భారీ ఐపీఓలు మన స్టాక్ మార్కెట్‌పై మదుపర్లలో నమ్మకాన్ని పెంచుతున్నాయి. మరోవైపు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగినప్పటికీ, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు కొనసాగుతుండటం ఐపీఓలు క్యూ కట్టడానికి మరో ముఖ్యకారణం.
ఈ ఏడాదిలో అతిపెద్ద ఐపీఓగా టాటా గ్రూపునకు చెందిన ఎన్‌బీఎఫ్‌సీ విభాగం టాటా కేపిటల్ మార్కెట్ల నుంచి రూ.15,512 కోట్లు సమీకరించనుంది. అక్టోబర్ 6-8 మధ్య సబ్‌స్క్రిప్షన్ ప్రక్రియ జరగనుంది. ఐపీఓ కొసం కంపెనీ ఒక్కో షేర్ ధరను రూ.310-326గా నిర్ణయించింది. ఇక, మరో బడా ఐపీఓగా ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఒక్కో షేరు ధర రూ.1,080-1,140తో ఇన్వెస్టర్ల నుంచి రూ. 11,607 కోట్ల నిధులను సేకరించేందుకు వస్తోంది. అక్టోబర్ 7-9 తేదీల్లో కంపెనీ బిడ్లను స్వీకరిస్తుంది. వీటితో పాటు అక్టోబర్ 3న వివర్క్ ఇండియా మేనేజ్‌మెంట్ ఐపీఓ ప్రారంభించింది. అలాగే, పైన్ ల్యాబ్స్, కెనడా హెచ్‌ఎస్‌బీసీ లైఫ్ ఇన్సూరెన్స్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్‌మెంట్ లాంటి కంపెనీలు ఈ అక్టోబర్‌లోపు ఐపీఓకు సిద్ధమవుతున్నాయి.






