- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CEA: అంతర్జాతీయ సవాళ్లను తట్టుకుని స్థిరమైన వృద్ధి సాధిస్తున్న భారత్
2026-27 ఆర్థిక సంవత్సరంలో భారత్ 7 శాతం మేర వృద్ధి చెందే దిశగా పయనిస్తోందని అన్నారు.

దిశ, బిజినెస్ బ్యూరో: భారత ఆర్థికవ్యవస్థ ప్రపంచ అనిశ్చితులను తట్టుకుని నిలబడిందని, విధానపరమైన చర్యలు, పటిష్టంగా ఉన్న దేశీయ ఆర్థిక అంశాలు ఇందుకు దోహదపడుతున్నాయని ప్రధాన ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్ అన్నారు. బుధవారం ఇండియా మారిటైమ్ వీక్ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. 2026-27 ఆర్థిక సంవత్సరంలో భారత్ 7 శాతం మేర వృద్ధి చెందే దిశగా పయనిస్తోందని అన్నారు. అంతర్జాతీయ పరిణామాలను ధీటుగా ఎదుర్కొంటూనే, భారత ఆర్థికవ్యవస్థ సంతృప్తికరంగా ఉంది. ఈ ఏడాది ప్రపంచ అనిశ్చిత పరిస్థితులకు ఆర్థికవ్యవస్థ తగ్గుకోగలిగింది. ముఖ్యంగా విధానపరమైన నిర్ణయాలు, టారిఫ్ సంబంధిత అంశాలు మరింత సానుకూలంగా ఉన్నాయని అనంత నాగేశ్వరన్ తెలిపారు. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో ఆదాయపు పన్ను ఉపశమనం, జీఎస్టీ రేట్ల సంస్కరణల వంటి విధానపరమైన చర్యలు వృద్ధికి మద్దతిస్తున్నాయి. ఇటీవల మూడు గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీలు మనదేశ ఔట్‌లుక్‌ను అప్‌గ్రేడ్ చేశాయి. ఇదే ధోరణి కొనసాగితే, త్వరలో భారత్ ప్రతిష్టాత్మక 'ఏ' రేటింగ్ కేటగ్రికీలోకి ప్రవేశిస్తుందని ఆయన వివరించారు.
ఈ సందర్భంగా బలహీనంగా ఉన్న దేశంలోని బ్యాంకు క్రెడిట్ వృద్ధిపై విశ్లేషకులు వ్యక్తం చేస్తున్న ఆందోళనలపై స్పందించారు. బ్యాంకు రుణాలు పెరగడం, ఆర్థికవ్యవస్థ బలహీనంగా ఉందని దీని అర్థం కాదని నాగేశ్వరన్ అన్నారు. కంపెనీలు డబ్బును పొందుతున్న ఇతర మార్గాలను కూడా మనం పరిశీలించాలని పేర్కొన్నారు. బ్యాంకుయేతర ఆర్థిక సంస్థలు, వాణిజ్య పత్రాలు, డిపాజిట్ సర్టిఫికెట్లు లేదా స్టాక్ మార్కెట్ వంటి వనరులన్నింటినీ కలిపి చూస్తే, ఆర్థికవ్యవస్థలో నిజంగా ఎంత డబ్బు ఉందో తెలుస్తుందని వెల్లడించారు.






