- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Economy: భారత ఆర్థికవ్యవస్థ వృద్ధి రేటు 6.5 శాతం: మూడీస్ రేటింగ్స్
2026లో 6.4 శాతం, ఆ తర్వాతి ఏడాది 6.5 శాతం పెరుగుతుందని తెలిపింది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ మూడిస్ రేటింగ్స్ భారత ఆర్థికవ్యవస్థ వృద్ధిపై సానుకూలంగా స్పందించింది. దేశ జీడీపీ 2027 నాటికి దాదాపు 6.5 శాతం మేర వృద్ధిని సాధిస్తుందని అంచనా వేసింది. 2026లో 6.4 శాతం, ఆ తర్వాతి ఏడాది 6.5 శాతం పెరుగుతుందని తెలిపింది. దేశ మౌలిక సదుపాయాల్లో భారీ పెట్టుబడులు, ప్రజల ఖర్చు చేసే ధోరణి పెరగడం, ఎక్కువ దేశాలకు ఎగుమతుల ద్వారా దేశ వృద్ధి సమర్థవంతంగా కొనసాగనుంది. అయితే, ప్రైవేట్ కంపెనీలు ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండటం కొంత ప్రతికూలంగా ఉండవచ్చు. భౌగోళిక రాజకీయ సవాళ్లు, భారతీయ వస్తువులపై అమెరికా అధిక సుంకాలు ఉన్నప్పటికీ దేశ ఆర్థికవ్యవస్థ పటిష్టంగా ఉంది. ఈ సందర్భంగా వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు వేర్వేరు ద్రవ్య విధనాలను అనుసరిస్తున్నాయని మూడీస్ అభిప్రాయపడింది. లేబస్ సమస్యల కారణంగా అమెరికా ఫెడ్ తన పాలసీ విధానాలను సవరిస్తోంది. దీంతో ఇతర సెంట్రల్ బ్యాంకులు మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చైనా, ఇండోనేషియా రేట్లను తగ్గిస్తుండగా, భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) మాత్రం తన పాలసీ విధానాన్ని స్థిరంగా కొనసాగిస్తోందని మూడిస్ పేర్కొంది.






