- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
RBI: ప్రపంచ వాణిజ్య ఉద్రిక్తతలు భారత వృద్ధిని ప్రభావితం చేయలేవు: ఆర్‌బీఐ
సరైన పాలసీ మద్దతు ప్రస్తుత అస్థిరతను భారత్ అవకాశంగా మార్చుకునేందుకు సహాయపడుతుందని నివేదికలో తెలిపింది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న వాణిజ్య ఉద్రిక్తతలు, భౌగోళిక పరిణామాలు భారత ఆర్థికవ్యవస్థను పెద్దగా హాని కలిగించవని భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) తన ఏప్రిల్ నెల బులెటిన్‌లో పేర్కొంది. సరైన పాలసీ మద్దతు ప్రస్తుత అస్థిరతను భారత్ అవకాశంగా మార్చుకునేందుకు సహాయపడుతుందని మంగళవారం విడుదల చేసిన నివేదికలో తెలిపింది. దేశానికి వెలుపల డిమాండ్ క్షీణించడం వల్ల ప్రపంచ ఆర్థిక వృద్ధి నెమ్మదించవచ్చు, ఫలితంగా భారత ఆర్థిక వృద్ధిపై కూడా ప్రభావం ఉంటుంది. అయినప్పటికీ దేశీయంగా వృద్ధికి అత్యంత కీలకమైన స్థానిక వినియోగం, పెట్టుబడులు బయట ప్రభావాలను అడ్డుకోగలవని, వృద్ధిపై ఎక్కువ ఒత్తిడి లేకుండా దోహదపడతాయని 'స్టేట్ ఆఫ్ ది ఎకానమీ' పేరుతో విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. సాధారణ అంచనాల కంటే ఎక్కువ రుతుపవనాలు వ్యవసాయ రంగానికి సానుకూల అంశాలు. ఇవి గ్రామీణ వినియోగాన్ని మెరుగుపరుస్తాయి. అమెరికా టారిఫ్ నిర్ణయాలు, అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం ప్రపంచ వృద్ధిని దెబ్బతీసినప్పటికీ, దేశీయంగా ఆహార పదార్థాల ధరలు స్థిరంగా ఉండటంతో దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం ఐదేళ్ల కనిష్ట స్థాయి 3.34 శాతానికి తగ్గింది. రానున్న రోజుల్లో సరఫరా వ్యవస్థలో మార్పులు, ఎఫ్‌డీఐలు, గ్లోబల్ ఇన్వెస్టర్లు మన మార్కెట్లపై చూపించే ఆసక్తి ద్వారా భారత్‌కు ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని ఆర్‌బీఐ అభిప్రాయపడింది. సేవల ఎగుమతులు, రెమిటెన్స్ నిధులు భారత వృద్ధికి సానుకూల అంశాలని నివేదిక వెల్లడించింది.






