మరో ప్రపంచ సంస్థకు భారత సీఈఓ.Devika Bulchandani

by Javid Pasha |   (  Updated:2022-09-09 05:15:40  IST  )

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచం వ్యాప్తంగా ప్రముఖ సంస్థలకు భారతీయులు సీఈఓలుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ప్రపంచం..

మరో ప్రపంచ సంస్థకు భారత సీఈఓ.Devika Bulchandani
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచం వ్యాప్తంగా ప్రముఖ సంస్థలకు భారతీయులు సీఈఓలుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ప్రపంచంలో అనేక సంస్థల యాజమాన్యాలు భారతీయులను సీఈఓగా నియమిస్తూ, వారి లీడర్‌షిప్‌లో సంస్థను నడుపుతున్నాయి. తాజాగా ఈ జాబితాలో మరో సంస్థ కూడా చేసింది. గ్లోబల్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఓగిల్వీ సీఈఓగా తాజాగా భారతీయురాలైన దేవికా బుల్‌చందాని నియమితురాలైంది. అమృత్‌సర్‌లో జన్మించిన దేవికా ఇప్పుడు నార్త్ అమెరికాలోని ఓగిల్వీకు సీఈఓ, గ్లోబల్ అధ్యక్షురాలిగా నియమితురాలైంది. ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా 93 దేశాల్లో బ్రాంచ్‌లను కలిగి ఉంది. అయితే ఆండీ మెయిన్ సంస్థ గ్లోబల్ ప్రెసిడెంట్, సీఈఓ పదవి నుంచి వైదొలగడంతో ఓగిల్వీ ఆ పదవికి దేవికాను నియమించింది. అయితే ఈ ఏడాది చివరి వరకు దేవికా ఓగిల్వీ సీనియర్ అడ్వైజర్‌గా విధులు నిర్వహించనుంది.

Also Read : మరో గ్లోబల్ సంస్థకు సీఈఓగా భారతీయ వ్యక్తి!

Next Story