Indian Budget Interesting Facts: ఫస్ట్‌ బ్లాక్‌ బడ్జెట్‌ ఇన్‌ ఇండియన్‌ హిస్టరీ.. బడ్జెట్‌ గురించి ఆసక్తికర విషయాలు

by Vennela |

Black Budget: చారిత్రాత్మకమైన ముఖ్యమైన పద్దుల్లో ఒకటైన 1973-74 బడ్జెట్ ను బ్లాక్ బడ్జెట్(Black Budget) అని పిలుస్తారు.

Indian Budget Interesting Facts: ఫస్ట్‌  బ్లాక్‌ బడ్జెట్‌ ఇన్‌ ఇండియన్‌ హిస్టరీ.. బడ్జెట్‌ గురించి ఆసక్తికర విషయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: Black Budget: చారిత్రాత్మకమైన ముఖ్యమైన పద్దుల్లో ఒకటైన 1973-74 బడ్జెట్ ను బ్లాక్ బడ్జెట్(Black Budget) అని పిలుస్తారు. ఎందుకు ఆ విధంగా పిలుస్తారు? సంచలనం రేపిన బ్లాక్ బడ్జెట్(Black Budget) వెనకున్న కథ ఏంటి? స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి నేటి వరకు బడ్జెట్ తో ముడిపడిన ఆ ఆసక్తికర వివరాలేంటో తెలుసుకుందాం.

భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర బడ్జెట్(Budget) ను పార్లమెంటులో ప్రవేశపెట్టబోతున్నారు. ఈ సందర్బంగా గతంలో ప్రవేశపె్టిన కేంద్ర బడ్జెట్లతో ముడిపడిన ఉన్న ఇంట్రెస్ట్ ఫ్యాక్ట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బ్లాక్ బడ్జెట్, పేపర్ లెస్ బడ్జెట్, దేశపు తొలిబడ్జెట్ ఇలా పలు రకాల బడ్జెట్లపై ఆసక్తికర విషయాలు చూద్దా.

బ్లాక్ బడ్జెట్(Black Budget) అంటే ఏమిటి?

భారతదేశపు తొలి బ్లాక్ బడ్జెట్ ను మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ(Indira Gandhi) హయాంలో 1973వ సంవత్సరం ఫిబ్రవరిలో ప్రవేశపెట్టారు. అప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రిగా యశ్వంత్ రావు చవాన్ ఉన్నారు. ఈ బడ్జెట్ కే బ్లాక్ బడ్జెట్ అని పేరు వచ్చింది. ఎందుకంటే ఆ బడ్జెట్ లో ద్రవ్యలోటు ఏకంగా రూ. 550కోట్లు. ద్రవ్యలోటును ఆందోళనకర స్థాయిలో చూపించడం వల్ల దీనికి బ్లాక్ బడ్జెట్ అనే పేరు వచ్చింది. 1971లో భారత్-పాక్ మధ్య యుద్దం(War between India and Pakistan), బంగ్లాదేశ్ తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ పూర్తిగా ఢీలా పడిపోయింది.

యుద్ధం ఖర్చులు, రాబడి తగ్గడం, ప్రభుత్వ ఖర్చులు పెరగడ వల్ల రూ. 550కోట్ల ఆర్థిక లోటుకు దారి తీసింది. ఆ సమయంలో ఇది చాలా పెద్ద ఖర్చు. చవాన్ తన బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక సంక్షోభాన్ని అంగీకరించారు. కొనసాగుతున్న కరువు ఆహారధాన్యాల ఉత్పత్తిని భారీగా తగ్గించిందని..ఎక్కువ బడ్జెట్ కొరతకు దారితీసిందని బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. అందుకే ఈ పద్దును అధికార, విపక్షాలు బ్లాక్ బడ్జెట్(Black Budget) గా పేర్కొన్నాయి. దేశంలోని జనరల్ బీమా కంపెనీలు, బొగ్గు గునులను ప్రభుత్వ పరం చేసే ప్రతిపాదన ఈ బడ్జెట్ లో కీలకంగా మారింది. ద్రవ్యోల్బణానికి ఎదురీది నిధుల లోటును పూడ్చుకునేందుకు ఇలాంటి ప్రతిపాదనలు తీసుకువచ్చారు. దేశానికి ఆర్థిక అత్యవసరాలు ఏర్పడ్డాయన్న అంశాన్ని ప్రతిబింబించేందుకు బ్లాక్ బడ్జెట్(Black Budget) అనే పదాన్ని అప్పట్లో ఉపయోగించారు.

1973-74 బడ్జెట్లో కీలక అంశాలు

ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ బడ్జెట్లో ప్రభుత్వం అనేక కీలకమైన విధాన నిర్ణయాలను తీసుకుంది. బొగ్గు గనులు, బీమా కంపెనీలు, ఇండియన్ కాపర్ కార్పొరేషన్ జాతీయికరణకు బడ్జెట్లో(Budget) రూ. 5కోట్లు కేటాయించారు. ఈ నిర్ణయం ఇంధన రంగాన్ని బలోపేతం చేస్తుందని ఆర్థిక వ్రుద్ధికి దోహదం చేస్తుందని ప్రభుత్వం విశ్వసించింది. భారీలోటుతో అనవసరమైన ఖర్చులను తగ్గించేందుకు, ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించేందుకు కఠినమైన చర్యలు తీసుకుంది.

1. మొదటి బడ్జెట్

స్వతంత్ర భారతావనికి మొదటి వార్షిక బడ్జెట్ ను 1948 ఫిబ్రవరి 28వ తేదీన ఆర్కే షణ్ముఖం శెట్టి(RK Shanmukham Shetty) ప్రవేశపెట్టారు. స్వంతంత్ర్యం అనంతరం దేశ ఆర్థిక పరిస్థితిని అంచనా వేసేందుకు 1947 నవంబర్ 26న మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఇది జరిగిన 3నెలల తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టారు.

2. బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రధానులు

భారత చరిత్రలో కేవలం 3 ప్రధానులు మాత్రమే బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 1958లో జవహర్ లాల్ నెహ్రూ(Jawaharlal Nehru), 1970లో ఇందిరాగాంధీ, 1987లో రాజీవ్ గాంధీ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.

3. పెద్ద, చిన్న బడ్జెట్

అతిపెద్ద కేంద్ర బడ్జెట్ ప్రసంగం చేసిన రికార్డ్ ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) పేరిట నమోదు అయ్యింది. 2020లో 2 గంటల 42 నిమిషాల పాటు కేంద్ర బడ్జెట్ ప్రసంగం చేశారు. 1977లో అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి హిరూభాయ్ పటేల్(Hirubhai Patel) 800 పదాలతో అతి చిన్న బడ్జెట్ ప్రసంగం చేశారు.

4. పేపర్ లెస్ బడ్జెట్ :

భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా 2021లో పేపర్ లెస్ మోడ్ (Paperless mode)లో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ప్రభుత్వ కార్యకలాపాల్లో పేపర్ వినియోగాన్ని తగ్గించడమే లక్ష్యంగా పేపర్ లెస్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.

5. బడ్జెట్ సమర్పణ తేదీల్లో మార్పు

కేంద్ర బడ్జెట్ ను 2016 వరకు ఫిబ్రవరి 28న ప్రవేశపెట్టేవారు. 2017లో ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టారు.

2025 యూనియన్ బడ్జెట్ అంచనాలు

మరో రెండు రోజుల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025 బడ్జెట్ ను సమర్పించనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) 3.0 ప్రభుత్వానికి ఇది మొదటి బడ్జెట్. ఆర్థిక వ్యవస్థ ప్రపంచ సవాళ్ల నుంచి కోలుకోవడంతోపాటు, నిపుణులు, పరిశ్రమ, వాటాదారుల విధాన మార్పులు, ఉపశమన చర్యల కోసం ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు.

Next Story