- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Airlines: విమానయాన రంగంపై చమురు ధరల భారం
విమానయాన సంస్థలు తమ సాధారణ కార్యకలాపాలను కొనసాగించడానికి తక్షణ ప్రభుత్వ మద్దతు అవసరమని పేర్కొంది.

దిశ, బిజినెస్ బ్యూరో: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా విమాన ఇంధనం ఏటీఎఫ్ ధరలు భారీగా పెరిగాయి. దీని ప్రభావం భారత విమానయాన సంస్థలపై తీవ్రంగా పడుతోంది. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్‌జెట్‌లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్‌లైన్స్(ఎఫ్‌టీఏ) విమానయాన రంగానికి తక్షణ సాయం అవసరమని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఈ మేరకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు రాసిన లేఖలో.. విమానయాన సంస్థలు తమ సాధారణ కార్యకలాపాలను కొనసాగించడానికి తక్షణ ప్రభుత్వ మద్దతు అవసరమని పేర్కొంది. సంస్థలు తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని, అధిక ఇంధన ధరలు దేశీయ, అంతర్జాతీయ కార్యకలాపాలను దెబ్బతీస్తున్నాయని స్పష్టం చేసింది.
రికార్డు స్థాయికి ఏటీఎఫ్ ధరలు
ఈ నెలలో ఏటీఎఫ్ ధర కిలోలీటరుకు రూ. 2 లక్షలకు పైగా పెరిగింది. ఇది ఇప్పటివరకు అత్యధికం. దేశీయ విమానాలకు ఇంధన ధరలు సుమారు 8.5 శాతం పెరిగాయి. చార్టర్, ప్రత్యేక విమానాల కోసం అయితే ధరలు ఇంకా ఎక్కువే పెరిగాయి. విదేశాల్లో ఏటీఎఫ్ ధరలు లీటరుకు రూ. 73–75 వరకు పెరగడంతో, అంతర్జాతీయ విమాన సర్వీసులు నష్టాల్లోకి వెళ్లే పరిస్థితి ఏర్పడింది.
ప్రస్తుతం విమానయాన సంస్థల ఖర్చుల్లో 55–60 శాతం వరకు ఇంధన ఖర్చులే ఉన్నాయి. గతంలో ఇది 30–40 శాతం మాత్రమే ఉండేది. ఈ నేపథ్యంలో ఎఫ్ఐఏ ప్రభుత్వం వద్ద కొన్ని ముఖ్యమైన డిమాండ్లు ఉంచింది. ఇందులో ప్రధానంగా ఏటీఎఫ్‌పై 11 శాతం ఎక్సైజ్ సుంకాన్ని తాత్కాలికంగా తొలగించాలని, ధరలను నియంత్రించేందుకు ప్రత్యేక విధానం తీసుకురావాలని, ప్రధాన ఎయిర్‌పోర్టుల్లో వ్యాట్ తగ్గించాలని కోరింది. మరోవైపు ప్రభుత్వం కూడా సింథటిక్ ఇంధనాలను ఏటీఎఫ్‌తో కలపడానికి అనుమతిచ్చింది. దీనివల్ల సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యుయెల్(ఎస్ఏఎఫ్) వినియోగాన్ని పెంచాలని భావిస్తోంది.






