- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
India: 'బెస్ట్ డీల్ ' ఉన్నందునే భారత్ చమురు కొనుగోలు చేస్తోంది: రష్యాలో భారత రాయబారి
భారత జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.

దిశ, బిజినెస్ బ్యూరో: భారత్ 'బెస్ట్ డీల్ ' ఉన్న దగ్గరి నుంచి చమురు కొనుగోలు ప్రక్రియను కొనసాగిస్తుందని రష్యాలోని భారత రాయబారి వినయ్ కుమార్ అన్నారు. రష్యా చమురు కొనుగోలు విషయంలో అమెరికా భారత్‌పై అదనపు సుంకాలు విధిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అంతేకాకుండా భారత జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆదివారం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. రష్యా చమురు కొంటున్నందుకు భారత వస్తువులపై సుంకాలను 25 శాతం నుంచి 50 శాతానికి పెంచాలనే అమెరికా నిర్ణయం అన్యాయం, అసమంజసమని విమర్శించారు. ప్రజలకు అనువైన చమురు సఫరా అందించడమే భారత ప్రభుత్వం లక్ష్యమని, అది రష్యా కావచ్చు, మరే దేశమైనా సరే భారత్ చమురు కొనుగోలు విధానం వల్లనే ప్రపంచ చమురు మార్కెట్ స్థిరంగా ఉండేందుకు దోహదపడిందనే విషయం మరవొద్దని అభిప్రాయపడ్డారు. దేశంలోని 140 కోట్ల మంది ప్రజలకు ఇంధన భద్రత అందించడం ముఖ్యం. ఇతర దేశాల మాదిరిగానే రష్యాతో భారత్ సహకారం ఉంటుంది. దీనివల్లనే ప్రపంచ చమురు మార్కెట్లో అస్థిరతను నెలకొనకుండా సహాయపడింది. కాబట్టి అమెరికా ఈ కారణంతో అధిక సుంకాలను విధించడం అన్యాయం. భారత్-రష్యా వాణిజ్యం పరస్పర ప్రయోజనాలు, మార్కెట్ పరిస్థితుల ఆధారంగా కొనసాగుతున్నది. అమెరికా, యూరప్ దేశాలతో సహా ఇతర దేశాలు కూడా రష్యాతో వాణిజ్యాన్ని కొనసాగిస్తున్న విషయాన్ని వినయ్ కుమార్ పేర్కొన్నారు.






