UPI : యూపీఐ లావాదేవీల్లో భారత్ టాప్‌

by Muthe.Rajitha |

యూపీఐ లావాదేవీల్లో భారత్ ప్రథమ స్థానంలో నిలిచిందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ప్రకటించింది.

UPI : యూపీఐ లావాదేవీల్లో భారత్ టాప్‌
X

దిశ, వెబ్ డెస్క్ : యూపీఐ లావాదేవీల్లో భారత్ ప్రథమ స్థానంలో నిలిచిందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ప్రకటించింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(UPI) ద్వారా 1800 కోట్లకు పైగా లావాదేవీలతో డిజిటల్ చెల్లింపులలో ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిచిందని ఐఎంఎఫ్ 2025 జూన్ ఫిన్‌టెక్ నోట్‌లో పేర్కొంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)చే 2016లో ప్రారంభించబడిన UPI.. 491 మిలియన్ వ్యక్తులు, 65 మిలియన్ వ్యాపారులను 675 బ్యాంకులతో అనుసంధానిస్తూ, దేశంలో 85% డిజిటల్ చెల్లింపులను నిర్వహిస్తోంది. జూన్లో UPI ద్వారా 18.39 బిలియన్ లావాదేవీలు నమోదయ్యాయి.

మేలో 18.68 బిలియన్ లావాదేవీలతో రికార్డు సృష్టించగా, ప్రపంచ రియల్-టైమ్ డిజిటల్ చెల్లింపులలో సుమారు 50% UPI ద్వారానే జరుగుతుండటం గమనార్హం. మరోవైపు బ్రిక్స్ దేశాలలో UPIని ప్రమాణంగా చేయాలని భారత్ ప్రయత్నిస్తోంది. ఈ విజయం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) యొక్క ముందుచూపు, ప్రభుత్వ డిజిటల్ ఎకానమీ విజన్, బ్యాంకులు, ఫిన్‌టెక్ కంపెనీల సహకారంతో సాధ్యమైందని IMF నివేదిక పేర్కొంది.

Next Story