- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
LPG: తొలిసారిగా యూఎస్ నుంచి భారత్‌కు ఎల్‌పీజీ దిగుమతి
ఈ ఒప్పందం దేశ ఇంధన భద్రతను బలోపేతం చేస్తుందని ప్రభుత్వం తెలిపింది.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయంగా ఇంధన భద్రతను పటిష్టం చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుంచి ఎల్‌పీజీ దిగుమతికి సంబంధించి సోమవారం మొదటి నిర్మాణాత్మక, చారిత్రాత్మక, దీర్ఘకాలిక ఒప్పందంపై సంతకం చేసినట్టు కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పురి అన్నారు. ఈ ఒప్పందం దేశ ఇంధన భద్రతను బలోపేతం చేస్తుందని, ప్రపంచ అస్థిరత పెరుగుతున్న నేపథ్యంలో మరిన్ని సరఫరా వనరుల లభ్యత పెరిగిందని ప్రభుత్వం తెలిపింది. 2026 కాంట్రాక్ట్ ఏడాదికి అమెరికా గల్ఫ్ కోస్ట్ నుంచి సంవత్సరానికి 2.2 మిలియన్ టన్నుల ఎల్‌పీజీని దిగుమతి చేసుకోవడానికి ప్రభుత్వ చమురు కంపెనీలు ఒప్పందాన్ని ఖరారు చేశాయని మంత్రి స్పష్టం చేశారు. ఇది దేశ ఎల్‌పీజీ వార్షిక దిగుమతుల్లో 10 శాతానికి సమానం. ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ సంస్థలు ఈ ఒప్పందంలో ఉన్నాయి. దీని ద్వారా దేశ ప్రజలకు అందుబాటులో ధరకే ఎల్‌పీజీని అందిస్తాం. దానికోసం అవసరమైన మార్గాలను అన్వేషించే క్రమంలోనే యూఎస్‌తో ఒప్పందం కుదిరిందని మంత్రి పేర్కొన్నారు.






