- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాలుగేళ్లలో అప్పర్ మిడిల్ క్లాస్ దేశంగా భారత్ : SBI రిపోర్ట్
మరో నాలుగేళ్లలో భారత్ అప్పర్ మిడిల్ క్లాస్ దేశంగా మారుతుందని SBI రీసెర్చ్ రిపోర్ట్ వెల్లడించింది. 2028 నాటికి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని, 2030 నాటికి అప్పర్ మిడిల్ ఇన్ కమ్ దేశాల క్లబ్ లో చేరుతుందని పేర్కొంది.

దిశ, వెబ్‌డెస్క్: మరో నాలుగేళ్లలో భారత్ అప్పర్ మిడిల్ క్లాస్ దేశంగా మారుతుందని SBI రీసెర్చ్ రిపోర్ట్ వెల్లడించింది. 2028 నాటికి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని, 2030 నాటికి అప్పర్ మిడిల్ ఇన్ కమ్ దేశాల క్లబ్ లో చేరుతుందని పేర్కొంది. భారత్ అప్పర్ మిడిల్ క్లాస్ గా మారే సమయానికి తలసి ఆదాయం 4 వేల డాలర్లు.. అంటే రూ.3,63,541ని తాకుతుందని అంచనా వేసింది. ఇది ఎంతో వేగంగా చోటుచేసుకున్న మార్పుగా నివేదిక పేర్కొంది. ఎందుకంటే, భారత్ ఒక లో-ఇన్‌కమ్ దేశం నుంచి లోయర్ మిడిల్ ఇన్‌కమ్ దేశంగా మారేందుకు 60 సంవత్సరాలు పట్టింది.
SBI నివేదిక ప్రకారం దేశంలో 1962లో తలసరి ఆదాయం 90 డాలర్లు ఉంటే.. 2007కు 910 డాలర్లకు పెరిగింది. కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 5.3 శాతంగా ఉంది. ఈ 60 ఏళ్లలో భారత్ 1 ట్రిలియన్ డాలర్ల జీడీపీని కూడా సాధించింది. గత పది సంవత్సరాల్లో భారత్ వృద్ధి ప్రయాణం మరింత వేగం పుంజుకుందని నివేదిక తెలిపింది. దేశాల మధ్య సగటు వాస్తవ GDP పంపిణీలో భారత్ స్థానం (Percentile Rank) 92 నుంచి 95వ స్థానానికి పెరిగింది.
ఈ నివేదిక ప్రకారం.. 2047 నాటికి భారత్ హై ఇన్ కమ్ దేశంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం హై ఇన్ కమ్ దేశాల్లో తలసరి ఆదాయం 13,936 డాలర్లుగా ఉంది. ఈ స్థాయికి భారత్ 2047 నాటికి చేరాలంటే ప్రతి వ్యక్తి Gross National Income 7.5 శాతం CAGRతో పెరగాల్సి ఉంటుంది. గత 23 సంవత్సరాల్లో భారత్ GNI ఇప్పటికే 8.3 శాతం CAGRతో పెరిగినందున ఈ లక్ష్యం సాధ్యమేనని నివేదిక అంచనా వేసింది. అయితే.. 2047 నాటికి హై-ఇన్‌కమ్ దేశాల పరిమితి మారే అవకాశం ఉందని కూడా హెచ్చరించింది. ఆ పరిమితి 18,000 డాలర్లకు పెరిగితే, భారత్ హై-ఇన్‌కమ్ దేశంగా మారాలంటే వచ్చే 23 సంవత్సరాల్లో వ్యక్తి GNI సుమారు 8.9 శాతం CAGRతో పెరగాల్సి ఉంటుందని నివేదిక స్పష్టం చేసింది.






