రెండేళ్లలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: అశ్విని వైష్ణవ్

by Disha Web Desk 17 |
రెండేళ్లలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: అశ్విని వైష్ణవ్
X

న్యూఢిల్లీ: రానున్న రెండేళ్లలో భారత్ ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం అన్నారు. మోదీ ప్రభుత్వం 9 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 2014 లో మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశంలో సామాజిక, ఆర్థిక మార్పులు వేగంగా జరుగుతున్నాయన్నారు. అలాగే, ప్రపంచ దేశాలు భారత్‌ను ఆకర్షణీయమైన గమ్యస్థానంగా చూస్తున్నాయని, పెట్టుబడుల పట్ల భారత్ ఇతర దేశాల నమ్మకాన్ని పొందినట్టు ఆయన తెలిపారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 10వ స్థానంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం 5వ స్థానానికి చేరుకుందని మంత్రి పేర్కొన్నారు. ఆరేళ్లలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించనుందని ఈ సందర్బంగా మంత్రి వ్యాఖ్యనించారు.

Also Read..

బ్యాటరీ సెల్ తయారీ ప్లాంట్ నిర్మాణాన్ని ప్రారంభించిన ఓలా ఎలక్ట్రిక్


Next Story

Most Viewed