Piyush Goyal: ఈ ఏడాది ట్రిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యం

by S Gopi |

భారతీయ ఎగుమతిదారులకు గ్లోబల్ మార్కెట్లలో మరిన్ని అవకాశాలు కల్పించేందుకు భారత్ ఇప్పటికే 38 అభివృద్ధి చెందిన దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏలు) కుదుర్చుకుందని గోయల్ చెప్పారు.

Piyush Goyal: ఈ ఏడాది ట్రిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యం
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి, అమెరికా విధించిన అధిక సుంకాలు, పశ్చిమాసియా ఉద్రిక్తతలు అంతర్జాతీయ వాణిజ్యాన్ని దెబ్బతీస్తున్నప్పటికీ.. భారత్ మాత్రం ఎగుమతుల్లో స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తోందని ఇటీవల కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయుష్ గోయల్ తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశం మొత్తం వస్తు, సేవల ఎగుమతులు కలిపి 863 బిలియన్ డాలర్ల(రూ. 82.58 లక్షల కోట్ల)కు చేరాయని, ఇది గతేడాదితో పోలిస్తే దాదాపు 5 శాతం ఎక్కువని వెల్లడించారు. ప్రస్తుతం భారత్ లక్ష్యం 1 ట్రిలియన్ డాలర్ల ఎగుమతుల మార్క్‌ను చేరుకోవడమేనని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా సేవల ఎగుమతులు పెరగడం దేశ ఆర్థికవ్యవస్థకు అతిపెద్ద బలంగా మారిందన్నారు. అదే సమయంలో వస్తు ఎగుమతులు కూడా 441.78 బిలియన్ డాలర్ల(రూ. 42.27 లక్షల కోట్ల)కు పెరిగినట్లు పేర్కొన్నారు. భారతీయ ఎగుమతిదారులకు గ్లోబల్ మార్కెట్లలో మరిన్ని అవకాశాలు కల్పించేందుకు భారత్ ఇప్పటికే 38 అభివృద్ధి చెందిన దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏలు) కుదుర్చుకుందని గోయల్ చెప్పారు. వ్యవసాయ ఎగుమతులు రూ.5 లక్షల కోట్లకు చేరుకున్నప్పటికీ, వాల్యూ అడిషన్ ఇంకా తక్కువగానే ఉందని, యువ పారిశ్రామికవేత్తలు ఫుడ్ ప్రాసెసింగ్, తయారీ రంగాల్లోకి వస్తే భారీ అవకాశాలు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు.

Next Story